Advertisement
Google Ads BL

సౌత్‌లో రజనీ తర్వాత ప్రభాసేనా?


ప్రభాస్‌కి నేషనల్‌ వైడ్‌గా స్టార్‌ హోదా 'బాహుబలి' చిత్రంతో వచ్చింది. అయితే ఇదేమీ రాత్రికి రాత్రి వచ్చిన స్టార్‌డమ్‌ కాదు. ఏకంగా ఐదేళ్లు ఒకే సినిమాకి కట్టుబడి రేయనక పగలనక కష్టపడితే వచ్చిన ప్రతిఫలం ఇది. ఇప్పుడు ఆ క్రేజ్‌ని ఎంతగా వాడుకుని, ఎలా, ఏ రేంజ్‌కి ఎదుగుతాడు? అనేది ప్రభాస్‌పై ఆయన ఎంచుకునే కథలపై ఆధారపడి ఉంది. ఇక 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ యువి క్రియేషన్స్‌ బేనర్‌లో వంశీ, ప్రమోద్‌లతో కలిసి 'సాహో' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం 'బాహుబలి'కి ముందు 50కోట్లతో అనుకున్న చిత్రం కాస్తా ఇప్పుడు 150కోట్లకు చేరింది. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌కి ఏకంగా 4కోట్ల పారితోషికం ఇస్తున్నారని సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రానికి గాను ప్రభాస్‌ 30కోట్ల పారితోషికంతో పాటు బిజినెస్ లో వచ్చే ప్రాఫిట్లలో కూడా లాభం తీసుకోనున్నాడు. ఇక యువి క్రియేషన్స్‌లో ప్రభాస్‌ కూడా భాగస్వామే అని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటే. ఇక ఇంతవరకు 30కోట్ల పారితోషికాన్ని సౌత్‌ ఇండియాలో ఒక్క రజనీకాంత్‌ తప్ప వేరే ఎవ్వరూ తీసుకోలేదని అంటున్నారు. 30కోట్లతో పాటు బిజినెస్‌ లాభాలలో వాటా అంటే ఆ స్థాయి మొత్తం తీసుకున్న తొట్టతొలి దక్షిణాది స్టార్‌ కేవలం ప్రభాసే అవుతాడని అంటున్నారు. 

ఇక 'స్పైడర్‌' చిత్రం కోసం మహేష్‌ 25-30కోట్ల మద్యలో రెమ్యూనరేషన్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్‌ది కూడా దాదాపు ఇంతే మొత్తాన్నే ఆయన కూడా త్రివిక్రమ్‌, హారిక అండ్‌ హాసిని బేనర్‌ నుంచి తీసుకుంటున్నాడని సమాచారం. వీరిద్దరు తమ తర్వాతి చిత్రాలైనా మైత్రి మూవీమేకర్స్‌ నుంచి, దిల్‌రాజు-అశ్వనీదత్‌ల నుండి తదుపరి చిత్రాలకు 30కోట్లు తీసుకోనున్నారట. అయినా ఇక్కడ వారికి బిజినెస్‌లో షేర్‌ లేదు. కానీ ప్రభాస్‌కి ఇది అదనంగా ఉండటంతో ప్రస్తుతం సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ప్రభాసే ముందున్నాడని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Prabhas Top Place After Rajini in Remuneration List :

Prabhas Takes 30 Crores above for Saaho Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs