Advertisement
Google Ads BL

ప్రభాస్ టైమ్ స్టార్ట్స్..!


'బాహుబలి' సినిమా వచ్చేసింది... ఆ సినిమా బంపర్ హిట్ అయ్యింది... కానీ ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'సాహో' షూటింగ్ లో మాత్రం ఇప్పటి వరకు జాయిన్ కాలేదు. 'సాహో' షూటింగ్ మొదలై కూడా రెండు నెలలు కావొస్తుంది. ఇక 'బాహుబలి' మేనియా నుండి బయటపడ్డ ప్రభాస్ దాదాపు మూడు నెలలు గ్యాప్ తీసుకుని ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ 'సాహో' కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు. అలాగే ఈ శుక్రవారం (ఆగస్ట్ 18) నుండే 'సాహో' షూట్ లో కూడా జాయిన్ కాబోతున్నాడు.

Advertisement
CJ Advs

'సాహో' సినిమా కోసం సారధి స్టుడియోస్ లో 5 కోట్ల రూపాయల ఖరీదైన భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే ప్రస్తుతం ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుజిత్. ఇక 'సాహో' కథ ప్రకారం సముద్ర గర్భంలో ప్రభాస్ సాహసాలు చేసే సన్నివేశాలు కొన్ని ఉన్నాయట.  అందుకోసమే కొన్ని అండర్ వాటర్ షాట్స్ కూడా ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్. వాటి కోసం ఈమధ్యే టెస్ట్ షూట్ కూడా డైరెక్టర్  కంప్లీట్ చేశాడని చెబుతున్నారు. అయితే ఆ సన్నివేశాలని త్వరలోనే  దుబాయ్ లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తెరకెక్కిస్తారని సమాచారం అందుతుంది.

ఇక హీరోయిన్ విషయమై మూడు నాలుగు నెలల నుండి వస్తున్న వార్తలకు..చిత్ర యూనిట్ ఫైనల్ గా ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ ని తీసుకుని..ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక శ్రద్ద కపూర్ కూడా ప్రభాస్ తో జోడి కట్టడం ఎగ్జైటింగ్ గా ఉందని.. త్వరలోనే 'సాహో' షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టు ట్వీట్ కూడా చేసింది. ఇక యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని 150  కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. 

Young Rebel Star Prabhas joins the sets of Saaho:

Prabhas joins the team for the shoot of Saaho
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs