సమంత - నాగ చైతన్యలు అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలో పెళ్లి చేసుకోబోతున్న విషయం విదితమే. మరి ఆ పెళ్లి కోసమే సమంత తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ ని వీలున్నంత వరకు కంప్లీట్ చేసే పనిలో పడింది. రామ్ చరణ్ తో చేస్తున్న 'రంగస్థలం' కోసం కష్టపడుతున్న సామ్.... 'మహానటి' కోసం కూడా డేట్స్ అడ్జెస్ట్ చేస్తూ షూటింగ్స్ కి హాజరవుతుంది. మరోపక్క తమిళ సినిమాల షూటింగ్స్ ని కూడా వీలైనంతవరకు కంప్లీట్ చేసే పనిలో పడింది.
అయితే సమంత తన మామ నాగార్జున కీ రోల్ చేస్తున్న 'రాజుగారి గది 2' లో గెస్ట్ రోల్ చేస్తుంది. అయితే ఆమె కేవలం నాగార్జున మీద ఉన్న గౌరవంతోనే 'రాజుగారి గది2' లో నటించడానికి ఒప్పుకుందనే టాక్ మొదటి నుండి ఉంది. ఇక ఆమె ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తుందనగానే ఈ సినిమాకి మంచి హైప్ వచ్చిన మాట కూడా వాస్తవమే. అయితే సమంత వల్లే హైప్ వచ్చిన ఆ మూవీ యూనిట్ ఇప్పుడు సమంత వల్లే టెన్షన్ పడుతుందట. 'రాజుగారి గది2' షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందనే సమాచారం ఉంది. కానీ ఇప్పుడు సమంతపై షూట్ చేయాల్సిన సీన్లు మాత్రమే బ్యాలెన్స్ వున్నాయని చెబుతున్నారు. అయితే సమంత మీద ఉన్న సీన్స్ పూర్తి చేసేందుకు సామ్ చిత్ర యూనిట్ కి డేట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది.
తాను హీరోయిన్ గా చేస్తున్న సినిమాలకి మాత్రమే టైం కేటాయిస్తున్న సమంత గెస్ట్ రోల్ చేస్తోన్న ‘రాజుగారి గది2’ని పట్టించుకోలేదనే టాక్ మొదలైంది. అలాగే సమంత ఇలా చెయ్యడం వలన నాగార్జున కూడా కొంచెం అప్ సెట్ అయ్యాడనే ప్రచారము షురూ అయ్యింది. కానీ మరోపక్క సమంత పక్కా ప్రొఫెషనల్ అనీ... హీరోయిన్‌గా...... గెస్ట్ రోల్ గా ఏది చేసినా కమిట్మెంట్‌తో పని చేస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు 'రాజుగారి గది2'కి డేట్స్ ఇవ్వకపోవడం అనేది జస్ట్ రూమరేనని అంటున్నారు.