Advertisement
Google Ads BL

అబ్బో.. ఈ ట్రైలర్ కి గోల్డ్ మెడల్ కూడా తక్కువే!


'పైసా వసూల్' స్టంపర్ లో బాలకృష్ణ డైలాగ్ డెలివరీ వీక్ గా ఉందని మాట్లాడిన వారందరికీ 'పైసా వసూల్' థియేట్రికల్ ట్రైలర్ తో చెంప పగిలే సమాధానం ఇచ్చాడు బాలకృష్ణ. పూరి డైరెక్షన్ లో తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రం సెప్టెంబర్ 1 న విడుదల సందర్భంగా ఆ సినిమా ఆడియో విడుదల వేడుక ఖమ్మం పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. అక్కడ ఆడియో వేడుకతో పాటే 'పైసా వసూల్' రెండు నిమిషాల నిడివిగల థియేట్రికల్ ట్రైలర్ ని కూడా లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో బాలయ్య విశ్వరూపాన్ని ఎలా చూపించాలో అలా  చూపించాడు పూరి.

Advertisement
CJ Advs

అస్సలు గ్యాప్ లేకుండా చెప్పిన బాలకృష్ణ డైలాగ్స్ ఈ 'పైసా వసూల్' ట్రైలర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. 'నా పేరు తేడా సింగ్ అంటూనే... ధిమాక్ తోడా. నేను చాలా తేడా అంటూ' విలన్స్ ని ఉతికారేస్తూ గన్ తో కాల్చేస్తూ బాలయ్య బాబు రచ్చ చేసాడంటే నమ్మాలి. డైలాగ్ తో రెచ్చిపోయిన బాలకృష్ణ ఎనర్జీతో చెప్పిన 'గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడ్ని.. మళ్ళీ టోర్నమెంట్స్ లో పెట్టొద్దు' అంటూ విలన్స్ ని చావచితక్కొడుతూ చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాయి. పూరి జగన్నాధ్ స్టయిల్ మాత్రం ఈ 'పైసా వసూల్' ట్రైలర్ లో అడుగడుగునా కనబడుతుంది. పూరి మార్క్ డైలాగ్, బాలయ్య మార్క్ ఎనర్జీ వెరసి 'పైసా వసూల్' ట్రైలర్ అని చెప్పొచ్చు. 

యాక్షన్ తోనే చితక్కొట్టేసిన బాలయ్య ముగ్గురు భామలతో రొమాన్స్ కూడా ఇరగదీశాడు. కైరా తో అదిరిపోయే ఐటెం వేసుకున్న బాలయ్య... ముస్కాన్, శ్రియ లతో పాటలతో హోరెత్తించాడు. అసలు బాలయ్య వేసే స్టెప్స్, పలికే డైలాగ్స్, చూపించే ఎనర్జీకి నందమూరి అభిమానులకు పూనకం వచ్చెయ్యడం ఖాయంగానే కనబడుతుంది. ఇక అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా అదరగొట్టేసింది. సినిమాటోగ్రాఫర్ ముకేష్ తన వర్కింగ్ స్టయిల్ చూపించాడు. ఇక నిర్మాతలైన భవ్య క్రియేషన్స్ వారు కూడా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. 

అసలు పైసా వసూల్ ట్రైలర్ మొత్తం ఒక్క బాలయ్యే కనబడుతున్నాడు. బాలయ్య ముందు విలన్స్, హీరోయిన్స్ కూడా తేలిపోయారా అనే ఫీలింగ్ తెప్పించి వదిలిపెట్టాడు బాలకృష్ణ. అంతటి ఎనర్జీతో చెలరేగి పోయి ట్రైలర్ ని చించి ఆరేసి సినిమాపై 100  కి 200 శాతం హైప్ క్రియేట్ చేశాడనడంలో అసలెటువంటి సందేహం లేదు.

Paisa Vasool Theatrical Trailer

Paisa Vasool Trailer Talk:

Natasimham Nandamuri Balakrishna's Paisa Vasool theatrical trailer was released during the audio launch of the movie held on 17th of August in Khammam.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs