Advertisement
Google Ads BL

సాయి పల్లవి ఇంకో షాక్ ఇచ్చింది..!


సాయి పల్లవి - వరుణ్ తేజ్ హీరోయిన్స్ గా తెరకెక్కిన 'ఫిదా' చిత్రం విడుదలైనప్పటినుండి ఆ చిత్ర హీరోయిన్ సాయి పల్లవి ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ తో మీడియాలో హైలెట్ అవుతూనే వుంది. ఆ సినిమా హిట్ తో ఆమెకి వరుస అవకాశాలు వెల్లువలా తలుపు తడుతుంటే ఆమె మాత్రం నాకు ఆ సినిమాల్లో కంఫర్టుబుల్ గా ఉంటేనే చేస్తాను. ఆ సినిమాలో నా కేరెక్టర్ నచ్చితేనే నటిస్తాను అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడమే కాదు సరిగా అలానే చేసి చూపెడుతుంది.

Advertisement
CJ Advs

తెలుగులో నటించింది ఒక్క సినిమానే. అయినా కూడా ఆమెకి ఆ ఒక్క సినిమాతోనే విపరీతమైన పేరొచ్చేసింది. ఇక 'ఫిదా' తర్వాత సాయి పల్లవి, దిల్ రాజు నిర్మాణంలో 'ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి)'లో నాని సరసన మిడిల్ క్లాస్ అమ్మాయిగా నటిస్తుంది. ఇకపోతే సాయి పల్లవి డబ్బు కోసం ఎలాంటి పనైనా చెయ్యనని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. అంతేకాకూండా భారీ పారితోషికాల కోసం షాప్ ఓపెనింగ్స్ లాంటివాటికి వెళ్లనని చెబుతున్న ఈ భామ ఇప్పుడు మరోసారి మరో విషయంలో హైలెట్ అయ్యింది.

అదేమిటంటే సాయి పల్లవి లిప్ లాక్ లకు చాల దూరమంట. సినిమాల్లో తనకి లిప్ లాక్స్ నచ్చవని అటువంటివి ఉంటే సినిమాలనే వదిలేసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. అలాగే గ్లామర్ విషయంలోనూ తనకి ఒక ఖచ్చితమైన అభిప్రాయముందని.... అందాల ఆరబోత తన సినిమాల్లో అస్సలు ఊహించవద్దని మొహమాటం లేకుండా చెబుతుంది. సో.. సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చే సినిమాల్లో గ్లామర్ షో గాని, లిప్ లాక్ లు గాని కనబడవన్నమాట.

Do not Expect Lip Locks From Sai Pallavi:

Sai Pallavi Shocking Decision on lip locks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs