తెలుగులో స్టార్ హీరోల, దర్శకులు, నిర్మాతల కొడుకులే కాకుండా పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టుల తనయులు కూడా హీరోలుగా మారుతున్నారు. బ్రహ్మానందం నుంచి ఎమ్మెస్‌నారాయణ, గిరిబాబు వరకు ఆ లిస్ట్‌లో ఎంతో మంది ఉన్నారు. ఇక తాజాగా మరో క్యారెక్టర్ ఆర్టిస్టు తనయుడు హీరోగా తెరంగేట్రం ఇవ్వనున్నాడు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్ శివాజీరాజా తెలియని వారుండరు. ఆయన తెలుగులో చిన్న చిన్న వేషాల నుంచి బుల్లితెర నుంచి బిగ్‌స్క్రీన్ వరకు ఆయన అందరికీ సుపరిచితుడు. ఇక ఈయన ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కి అధ్యక్షునిగా కూడా ఉన్నాడు. త్వరలో తాను రాజకీయాలలోకి వెళ్తానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈయన తన కుమారుడైన విజయ్‌ని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఆయన కమారుడి పేరు విజయ్. ఇప్పటికే ఆయన తనయుడికి చదువు కూడా పూర్తయిందట. ఇక అతనిని నటనలో కూడా శిక్షణ ఇప్పించామని శివాజీరాజా చెబుతున్నాడు.
ఇప్పటికే ఇద్దరు దర్శకులు తన కుమారుడిని హీరోగా లాంచ్ చేస్తామని వచ్చారని, హీరోగా పరిచయం చేసే కథ బాగుంటే అది తన కుమారుడి కెరీర్‌కి మరింత బాగా హెల్పవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన కథ విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవడం కోసం పలు శ్రద్దలు తీసుకుంటున్నానని తెలిపాడు. ఇక విజయ్ బాలనటునిగా కూడా ఓ చిత్రంలో నటించాడు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'విరోధి' చిత్రంలో విజయ్ బాలనటునిగా యాక్ట్ చేశాడు. నిజ జీవితంలో తండ్రికొడుకులైన శివాజీరాజా- విజయ్ లు ఈ 'విరోధి' చిత్రంలో సైతం అలాగే నటించడం విశేషం. ఇక శివాజీరాజా పోలిటికల్ ఎంట్రీ, విజయ్ హీరోగా తెరంగేట్రం కూడా వచ్చే ఏడాదిలోనే జరగవచ్చని, 2019 ఎన్నికల లోపే శివాజీరాజా తన పొలిటికల్ అరంగేట్రంపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.