Advertisement
Google Ads BL

అంతా బాలయ్య చేతుల్లోనే వుంది!


పూరీజగన్నాథ్‌ చిత్రాలలో హీరోయిజాన్ని చూపించే విధానం, దానికి ఆయన చెప్పించే డైలాగ్‌లు ఎంతో మజాగా ఉంటాయి. ఇక డైలాగ్స్‌ చెప్పడంలో నందమూరి నటసింహం సంగతి చెప్పనే అవసరం లేదు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం అనే సరికి నందమూరి అభిమానుల్లో జోష్‌ నిండిపోయింది. నిజానికి రాజమౌళి, వినాయక్‌, బోయపాటి వంటి వారు కొన్ని సీన్స్‌లో చూపించే హీరోయిజాన్ని పూరీ ఒకే ఒక్క డైలాగ్‌తో చెప్పేస్తాడు. 

Advertisement
CJ Advs

ఇక ఆయన సీనియర్‌ స్టార్స్‌లో నాగార్జునని మాత్రమే రెండు సార్లు డైరెక్ట్‌ చేసి ఉన్నాడు. ఇక చిరంజీవితో సినిమా వచ్చినట్లే వచ్చి చేజారింది. ఇక వెంకీతో త్వరలో చేసే అవకాశం ఉంది. ఇక బాలయ్యతో పూరీ స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, బాలయ్య పంచ్‌లు అనగానే జనాలు ఆనందంలో మునిగిపోయారు. ఇక ఈ చిత్రం గురించి పూరీ చెబుతూ, నాకు ఇది ఎంతో అరుదైన అవకాశం. బాలయ్యతో చేసే అవకాశం నాకు వచ్చింది. దీనిని ఎలా ఉపయోగించుకుంటానో మీరే చూడండి. ఈసందర్భంగా బాలయ్యబాబు అభిమానులకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. ఈచిత్రంలో డైలాగ్‌లు చిన్నగా ఉండవు. ఈ చిత్రంలోని బాలయ్య డైలాగ్‌లకు ఒక ఆడియో సీడీ సరిపోదు అని ఎంతో నమ్మకంగా, ఉద్వేగంగా చెప్పాడు. 

దీన్నిబట్టి  ఆడియో వేడుక పై బాలయ్య ఏదైనా డైలాగ్ చెప్తే..ఇక ఈ సినిమాపై అంచనాలు మాములుగా ఉండవ్. స్టేజ్ పై ఇప్పటికే పాట పాడుతున్నాడని న్యూస్ వచ్చింది. ఇక డైలాగ్ కూడా చెప్పేస్తే.. ఈ సినిమా ప్రమోషన్ కి పెద్దగా స్కెచ్ లు కూడా అవసరం లేదు. ప్రమోషన్  పీక్స్‌కి చేరడం ఖాయం. అంతా బాలయ్య చేతుల్లోనే వుంది. శ్రియా శరన్‌ హీరోయిన్‌గా నటించిన ఇందులో ముస్కాన్‌ సేథీ, కైరాదత్‌లు నటిస్తుండగా, అనూప్‌రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

Balayya Sings Song in Paisa Vasool Audio Stage:

Paisa Vasool Future in Nandamuri Balakrishna Hands
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs