Advertisement
Google Ads BL

మహేష్‌, సెప్టెంబర్‌ 9 న ఏం జరగబోతోంది?


మహేష్‌బాబు చిత్రాల కథల నుంచి డైరెక్టర్‌, రెమ్యునరేషన్ వరకు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్‌ ప్రతిది ఎంతో బాగా, సునిశితంగా చూసి ఒప్పుకుంటూ ఉంటారు. తాజాగా మీరు మరలా నటిగా రీఎంట్రీ ఇవ్వనున్నారా? అని అడిగితే తన భర్త చేస్తున్న చిత్రాలు, బ్రాండ్‌ అంబాసిడర్స్‌ అగ్రిమెంట్లు, ఇతర వ్యవహారాలు, తన బిడ్డలైన గౌతమ్‌కృష్ణ, సితారల గురించి చూసుకోవడానికే తనకు సమయం సరిపోవడం లేదని ఇక తాను నటిగా చేయడానికి సమయం లేదని ఓపెన్‌గా చెప్పేసింది . ఇక మహేష్‌బాబు ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'రాజకుమారుడు' ఆవిష్కరణ ఎలా జరిగిందో నమ్రతాశిరోద్కర్‌కి ఆయన పిల్లలైన గౌతమ్‌, సితారలకు తెలిసి ఉండదు, కానీ మహేష్‌ కోలీవుడ్‌ లాంచ్‌ మాత్రం వీరికి సమ్‌థింగ్‌ స్పెషల్‌ కిందనే చెప్పాలి. 

Advertisement
CJ Advs

మురుగదాస్‌తో చేస్తున్న 'స్పైడర్‌' చిత్రం ద్వారా మహేష్‌ తొలిసారిగా తమిళంలోకి స్ట్రెయిట్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం కోసం సెప్టెంబర్‌ 9వ తేదీన చెన్నైలో ఓ న్యూలాంచ్‌ లెవల్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రస్తుతం తెలుగు మార్కెట్‌ బాగా విస్తరించడం, సినిమాల బడ్జెట్స్‌ కూడా 100కి పైగానే అవుతుండటంతో మహేష్‌ కూడా ఇంత కాలం ఇతర భాషలను పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోయినా ఇప్పుడు మాత్రం ద్విభాషా చిత్రాలవైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఉంది. 

తమిళ స్టార్స్‌ అయిన కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, సూర్య నుంచి విశాల్‌, కార్తిల వరకు తెలుగులో ఎలా మార్కెట్‌ని విస్తరించుకున్నారో అదే తరహాలో తమిళం అనర్ఘళంగా మాట్లాడగలిగి అక్కడే పుట్టి పెరిగిన మహేష్‌ కూడా తమిళ ఎంట్రీని ప్రెస్టీజియస్‌గానే తీసుకుంటున్నాడు. ఇక బాలీవుడ్‌ ఎంట్రీ విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకోనున్నాడో వేచిచూడాల్సివుంది. ఇక 'స్పైడర్‌' చిత్రాన్ని తమిళంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ రిలీజ్‌ చేస్తుండటంతో ఈ వేడుకకు '2.0' టీం హాజరైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మహేష్‌కి తమిళంలో స్నేహితులు కూడా ఎంతో మంది ఉన్నారు.. సో సెప్టెంబర్‌9వ తేదీ కోసం వెయిట్‌ అండ్‌ సీ...! 

Mahesh Babu’s Grand Entry into Kollywood:

Mahesh Babu is all set to make a grand entry into Kollywood with Spyder
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs