Advertisement
Google Ads BL

నాలుగో మావయ్య తో సాయి ధరమ్ తేజ్!


పవన్‌కళ్యాణ్‌కి హీరోగా తొలి సూపర్‌హిట్టుని అందించిన చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్రంలోని ఫీల్‌ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఎప్పుడు చూసినా అదే ఫీల్‌తో ఉండి ఆకట్టుకోవడం, ఎన్ని ఏళ్లయినా, ఎన్నిసార్లు చూసినా అదే ఫీల్‌తో ఉండటం ఆ చిత్రం అంతటి బ్లాక్‌బస్టర్‌ కావడానికి ప్రధాన కారణం. ఇక అదే చిత్రంతో దర్శకుడు కరుణాకరన్‌ ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్‌గా మారిపోయాడు. ఆ తర్వాత కూడా ఆయన పలు చిత్రాలను డైరెక్ట్‌ చేసినా ప్రతి చిత్రాన్ని 'తొలిప్రేమ'తో కంపేర్‌ చేయడం, ఆ చిత్రంతో పోల్చి చూడటం వల్ల అవి సరిగా ఎలివేట్‌ కాలేకపోయాయి. 

Advertisement
CJ Advs

ఇక ఆయన వెంకటేష్‌తో చేసిన 'వాసు', కొత్త వారితో చేసిన 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా' చిత్రాలు కూడా ఎంతో బావుంటాయి. ఇక ఆయన కెరీర్‌లో బాగాలేని చిత్రాల గురించి చెప్పాలంటే రామ్‌తో చేసిన 'ఎందుకంటే ప్రేమంట, చిన్నదాన నీకోసం' చిత్రాలను చెప్పవచ్చు. ఇక చిన్న మావయ్య పవన్‌తో కరుణాకరన్‌ 'తొలిప్రేమ' తీసే సమయానికి ఆయన మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ చాలా చిన్నవాడట. ఇక నాడు తాను ఎగ్జైట్‌ అయి షూటింగ్‌ లోకేషన్స్‌లో ఎలా గోల చేశానో ఈ చిత్రం విషయంలో కూడా తాను అలాగే ఫీలవుతున్నానని తేజూ చెబుతున్నాడు. 

ఇక ఈ చిత్రాన్ని తన పెద్ద మావయ్యతో ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ తీసిన సీనియర్‌ నిర్మాత కె.యస్‌.రామారావు నిర్మిస్తుండటం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కరుణాకరన్‌ని మరో మావయ్యగా పిలుస్తాననని తేజ్‌ అంటున్నాడు. మరి ఇబ్బందుల్లో ఉన్న సాయిధరమ్‌తేజ్‌ - కరుణాకరన్‌ - కె.యస్‌.రామారావుల కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం తెలుగు నాట, మరీ ముఖ్యంగా మాస్‌ హీరోగా పేరు తెచ్చుకుంటోన్న సాయి ధరమ్‌ తేజూకి ఎలాంటి హిట్‌ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Sai Dhram Tej and Karunakaran Movie Launched:

Sai Dhram Said, Karunakaran is his Another Uncle. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs