Advertisement
Google Ads BL

అజిత్ ట్రైలర్ మాములుగా లేదు..!


అజిత్ హీరోగా కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ హీరోయిన్స్ గా... బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా కోలీవుడ్ లో శివ డైరెక్షన్ లో 'వివేగం' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. 'వివేగం' మూవీ షూటింగ్ చాలా భాగం సెర్బియా, బల్గేరియాల పరిసర ప్రాంతాల్లో జరిగిందని.... ఈ మూవీ లో  అజిత్ ఇంటర్ పోల్ ఏజంటుగా నటిస్తున్నాడనేది తెలిసిన విషయమే. ఇక డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని ఒకప్పుడు యూరప్ లో జరిగిన టెర్రర్ అటాక్ ఆధారంగా దీన్ని క్రైం యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించినట్లు తెలిపాడు.

Advertisement
CJ Advs

విడుదలకు సిద్దమవుతున్న 'వివేగం' చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అజిత్ ఇరగదీసే యాక్షన్ తో, హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే అంతా భారీతనమే కనబడుతుంది. అజిత్ ఎప్పటిలాగే మాస్ లుక్, క్లాస్ లుక్ తో ఆకట్టుకున్నాడు. యుద్ధం చేసేటప్పుడు ఉండే ఎమోషన్, యాక్షన్ కలగలిపిన అజిత్ ఎప్పటిలాగే సూపర్బ్ అనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా చాలా సంప్రదాయంగా చీర కట్టులో అదరహో అనే రీతిలో ఈ చిత్రంలో అజిత్ కి వైఫ్ గా నటిస్తుంది. ఇక అక్షర హాసన్ మాత్రం మోడరన్ గర్ల్ గా కనబడుతుంది.

అలాగే విలన్ వివేక్ ఒబెరాయ్ విషయానికి వస్తే ఈ చిత్రంలో ఒక స్టైలిష్ విలన్ మనం చూడబోతున్నాం. వివేక్ చాలా స్టయిల్ గా విలనిజాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడనేది మాత్రం అర్ధమవుతుంది. ఇంతకుముందు టీజర్, ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచిన 'వివేగం' ఇప్పుడు ఈ ట్రైలర్ తో మరోసారి భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం ఈ నెల 24 న 'వివేగం' గా తమిళ, 'వివేకం' గా తెలుగు భాషల్లో విడుదల కాబోతుంది.

Click Here to see the Trailer

Ajith Vivegam Trailer Released:

Ajith Kumar Vivegam Trailer sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs