Advertisement
Google Ads BL

మెగా ఫ్యాన్స్ నిరాశోద్దు. మీది మీకే వుంది..!


ఎవరికీ చెప్పకుండా.... కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా ఎంతో సీక్రెట్ గా చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని లాంచ్ చేసేశారు మెగా ఫ్యామిలీ మెంబెర్స్. ఈ వేడుకని రామ్ చరణ్ ఆఫీస్ అయిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఆఫీస్ లో జరిగింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన భార్య పిలల్లతో ఈ వేడుకకి హాజరవగా... మెగాస్టార్ చిరు కూడా భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్ తో విచ్చేశాడు. అలాగే ఇండస్ట్రీలోని ఉయ్యాలవాడ ప్రాజెక్ట్ కి సంబందించిన కొద్దిమంది ముఖ్యుల మధ్యలో ఈ ఓపెనింగ్ వేడుక వైభవంగా జరిగింది. కాకపోతే సినిమా లాంచ్ అయినందుకు ఒక పక్క ఫ్యాన్స్ కి ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ ఇలా చడీ చప్పుడు చెయ్యకుండా ఉయ్యాలవాడని లాంచ్ చెయ్యడం వారికి మింగుడు పడడంలేదు.

Advertisement
CJ Advs

అయితే చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ మూవీ లాంచ్ చేస్తామన్నారు మొదట్లో. కానీ అప్పుడు మంచి రోజులు లేని కారణంగా ఈ బుధవారం సినిమాని లాంచ్ చేసి చిరు బర్త్ డే రోజున ఫ్యాన్స్ కోసం ఆఫీషియల్ గా ఉయ్యాలవాడ టైటిల్ లోగోని లాంచ్ చెయ్యబోతున్నారట. అలాగే టైటిల్ మోషన్ పోస్టర్ ని కూడా లాంచ్ చేసి మెగా ఫాన్స్ కి డబుల్ బొనాంజా ఇవ్వనున్నారట. ఈ విషయాన్ని రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. 

ఇక ఈ మోషన్ పోస్టర్ తాలూకు యానిమేషన్ కూడా అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే చిరు పుట్టిన రోజున అంటే ఆగష్టు 22 ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ కానుందట. ఇకపోతే మెగాస్టార్ 151 వ చిత్రానికి టైటిల్ 'మహావీర' అయితే బావుంటుందని అభిప్రాయలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ టైటిల్ విషయమై ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ బర్త్ డే కి అన్నీ రివీల్ అయిపోతాయి గనక దీనికోసం ఓ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 22 వరకు వెయిట్ చేస్తే చాలు. 

Megastar Chiranjeevi 151 Movie title announce Update:

2 Festivals to Mega Fans on Chiranjeevi Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs