'ఫిదా' చిత్రం విడుదలకు ముందు వరుణ్‌తేజ్ వరుస ఫ్లాప్‌లలోఉన్నాడు. దర్శకుడు శేఖర్‌కమ్ములది కూడా అదే పరిస్థితి. సాయిపల్లవికి అదే హీరోయిన్‌గా తెలుగులో మొదటి సినిమా. మిగిలిన నటీనటులు, సంగీత దర్శకులు కూడా పేరున్న వారు కాదు. ఈ చిత్రం విడుదలకు ముందు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ కేవలం నిర్మాత దిల్‌రాజు మాత్రమే. కానీ ఈ చిత్రం విడుదలైన తర్వాత సంచలనం సృష్టించి, బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్నే సృష్టించింది.
ఎన్ని చిత్రాలు విడుదలైనా ఇప్పటికీ తన కలెక్షన్లను తాను కొల్లగొడుతోంది. ఇక ఇలాంటి వైవిధ్యభరితమైన చిత్రాలు ఓవర్‌సీస్‌లో ఎలా ఆడుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఆ వైవిధ్యం అంతా ఈ చిత్రంలో నిండుదనంగా ఉండటంతో 'ఫిదా' ఓవర్‌సీస్ ప్రేక్షకులను కూడా ఫిదా చేసేసింది. తాజాగా ఈచిత్రం రెండు మిలియన్ల డాలర్ల క్లబ్‌లో కూడా చేరింది. ఈ చిత్రం రెండు మిలియన్‌డాలర్లను వసూలు చేసిన ఎన్టీఆర్- సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం కలెక్షన్లను కూడా దాటేసింది.
ఈచిత్రం కంటే ముందు 'బాహుబలి-ది కన్‌క్లూజన్', 'బాహుబలి-ది బిగినింగ్', 'శ్రీమంతుడు, ఖైదీ నెంబర్ 150, ఆ..ఆ' చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇవ్వన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే. ఒక్క 'అ..ఆ' మాత్రమే ఓ మోస్తరు బడ్జెట్‌తో రూపొందిన చిత్రం. అందునా ఆ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఇక నితిన్, సమంతలు కూడా ఓ మంచి స్థాయిలో ఉన్న నటీనటులే.
మరి టోటల్‌గా ఓవర్‌సీస్‌లో హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన తొలి ఆరు చిత్రాలలో 'ఫిదా' చిత్రం కూడా చోటు దక్కించుకోవడం విశేషంగానే చెప్పాలి. ఇంకా కలెక్షన్లు బాగానే ఉన్నాయని, రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారని అంటున్నారు. మరి ఈ చిత్రం 'ఖైదీనెంబర్ 150, ఆ..ఆ'లను కూడా దాటినా ఆశ్యర్యం లేదంటున్నారు ట్రేడ్ పండితులు.