Advertisement
Google Ads BL

వామ్మో... సైలెంట్ గా కానిచ్చేశారు..!


చిరంజీవి 151  వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం ఎప్పుడెప్పుడు మొదలెడతారా అని మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ గాని ఉయ్యాలవాడ ఓపెనింగ్ గురించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేకపోతున్నారు. కారణం ఉయ్యాలవాడ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉండడమే అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇక సినిమా ఆగష్టు 15 న మొదలుపెట్టి సెట్స్ మీదకెళతారని చెప్పినప్పటికీ.... చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22 నే సినిమా ఓపెనింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఇక సినిమా అయితే ఆగష్టు 15 న మొదలవ్వలేదు.

Advertisement
CJ Advs

కానీ ఈ రోజు ఆగష్టు 16  బుధవారం ఎటువంటి చడీ చప్పుడు లేకుండా చిరు 151  వ చిత్రం సైలెంట్ గా ఓపెనింగ్ చేసేసుకుంది. కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరు ఫ్యామిలీ సభ్యులు, పరుచూరి బ్రదర్స్, నిర్మాత అల్లుఅరవింద్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఇండస్ర్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఆ నోటా ఈనోటా  ఈ విషయం మీడియాకి  పొక్కడంతో...  ఈ రోజు మంచి రోజు కనకనే చిరంజీవిగారి 151  చిత్ర పూజ కార్యక్రమాలను నిర్వహించామని.... ఆగష్టు  22న చిరు పుట్టినరోజున అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఉంటుందని.... చిత్ర యూనిట్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.

ఇక ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళం, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేసే ఆలోచనలో చిత్ర దర్శకనిర్మాతలు ఉన్నారు. అలాగే ఈ చిత్రానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్  కన్నా మహావీర అనే టైటిల్ అయితే బావుంటుందనే ఆలోచనలో కూడా చిత్ర యూనిట్ ఉన్నట్లు చెబుతున్నారు. 

Uyyalawada Narasimha Reddy Film Launched:

Mega Star Chiranjeevi’s 151st film Uyyalawada Narasimha Reddy is launched today with formal pooja held this morning at Konidela Production Company
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs