Advertisement
Google Ads BL

మెగాహీరోకి జోడీగా లక్కీగర్ల్‌..!


ఎంతో ప్రతిభ ఉన్నా కూడా సరైన హైట్‌ లేదనే కారణంగా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ కాలేకపోయింది. ఇక ఆమె 'ప్రేమమ్‌'లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సెకండ్‌ హీరోయిన్‌గా సమంత తర్వాత లీడ్‌రోల్‌ని పోషించింది. ఆతర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్‌'లో నటించింది. తదుపరి అవార్డుతో పాటు రివార్డులు కూడా పొందిన 'శతమానం భవతి'లో దిల్‌రాజు ప్రొడక్షన్‌లో శర్వానంద్‌ సరసన నటించి లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఆమె రామ్‌ సరసన 'ఉన్నది ఒకటే జిందగీ', నాగ చైతన్యతో ఓ చిత్రం, నాని-మేర్లపాక గాంధీల 'కృష్ణార్జున యుద్దం'తో పాటు తమిళ్‌, మలయాళం చిత్రాలలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ భామ మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. రామ్‌తో ఓ ప్రేమకదా చిత్రం తీయాలని ఓ వినూత్నప్రేమకథను లవ్‌స్టోరీస్‌ స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ తయారు చేసుకున్నాడు. కానీ 'ఎందుకంటే ప్రేమంట' వంటి ఫెయిల్యూర్‌ని ఇచ్చిన రామ్‌ చివరి వరకు ఓకే అని చివరి నిమిషంలో పక్కనపెట్టాడు. 

దాంతో అదే కథకు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇదే కథను ఆయన మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌కి వినిపించి, ఆయనను తొలిసారిగా లవర్‌బోయ్‌ ఇమేజ్‌తో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌ పాత్రకు మలయాళ కుట్టి, 'ప్రేమమ్‌' అనుపమ పరమేశ్వరన్‌ని ఎంచుకున్నారు. సాదారణంగా కరుణాకరన్‌ ట్రాక్‌ రికార్డును బట్టి చూస్తే ఓ హిట్‌ రెండు ఫ్లాప్‌లన్నట్లుగా ఆయన స్థితి ఉంటుంది. మినిమం గ్యారంటీ ఉన్న దర్శకునిగా ఈయనను చెప్పుకోలేం. మరి ఈయన సాయి ధరమ్‌ తేజ్‌ని, అనుపమ పరమేశ్వరన్‌లకు ఎలాంటి హిట్‌ని అందిస్తాడో వేచిచూడాల్సివుంది...! 

Sai Dharam Tej and Anupama Parameshwaran Combination Film!:

<span>Premam girl Anupama Parameswaran is going to romance Sai Dharam Tej for the first time.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs