Advertisement
Google Ads BL

గుండీలు తీసి కాలర్ ఎగరేస్తే వసూలే వసూల్!


పూరి జగన్నాధ్ - బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న 'పైసా వసూల్' పైసల్ వసూలు చెయ్యడానికి రెడీ అయ్యింది. సెప్టెంబర్ 1 న విడుదల కానున్న ఈ మూవీ ఆడియో ఖమ్మంలో ఈ నెల 17 న అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే నందమూరి అభిమానుల రచ్చ మొదలైపోయింది. అందులో ఈ ఆడియో వేడుకలో బాలయ్యబాబు వేదికమీద పాటందుకోనున్నాడనే న్యూస్ వారిని కుదురుగా ఉండనియ్యడంలేదు. అలాగే 'పైసా వసూల్' స్టంపర్ తో, మేకింగ్ వీడియోతో  బాలయ్య - పూరీల రచ్చ ముగియకముందే ఇపుడు 'పైసా వసూల్' టైటిల్ సాంగ్ ని యూట్యూబ్ లో వదిలేసింది 'పైసా వసూల్' చిత్ర యూనిట్. 

Advertisement
CJ Advs

స్టంపర్ లో, మేకింగ్ వీడియోలో బాలయ్య ఎనర్జీ చూసి బాలకృష్ణకి అంత వయసు వచ్చింది అంటే ఎవరు నమ్మరనేలా ఉంది బాలయ్య నటన. మరి పూరి మార్క్ డైలాగ్స్ తో స్టంపర్ లో దుమ్ము లేపిన బాలయ్య ఇప్పుడు ఈ టైటిల్ సాంగ్ లో 'పైసా వసూల్' అంటూ రచ్చ రచ్చ చేశాడు. ఆ పాటలో బాలయ్య చేతికి కట్టిన పూల దండను స్టయిల్ గా తిప్పుతూ వస్తుంటే చూడండి..... బాలయ్యని అలా చూసిన వారంతా వామ్మో బాలయ్య అదేందయ్యో.. ఆ స్పీడు తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ పడేస్తున్నారు. ఇక తొడగొడుతూ డాన్స్ చేస్తూ 'నేనడుగెడితే.... షో మొదలెడితే.... అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే....  అరె వసూలు.. వసూలు.. పైసా వసూలు' అంటూ బాలకృష్ణ స్టెప్స్ చూస్తుంటే మనకి ఊపొచ్చేస్తుంది. బాలకృష్ణ స్టయిల్, ఎక్సప్రెషన్స్, డాన్స్ ని చూసిన ఎవరైనా ఆయనకు అంత వయసుందంటే నమ్మరు. అంతలా కుర్రాడిలా రెచ్చిపోయి డాన్స్ చేసి మతులు పోగెట్టేశాడు బాలకృష్ణ. ఇక ఈ సాంగ్ లో నర్తించిన భామ అందాలు కూడా అదరహో అనేలా వున్నాయి.

ఈ సాంగ్ కి మెయిన్ హైలెట్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్. అనూప్ అదిరిపోయే మ్యూజిక్ 'పైసా వసూల్' కి అందించాడు. అనూప్ మ్యూజిక్ స్టైల్... పూరి మార్క్ స్టయిల్..... బాలయ్య మార్క్ ఎనర్జీ చూస్తుంటే 'పైసా వసూల్' మాత్రం 100  కోట్ల క్లబ్బులో హుందాగా అడుగుపెట్టేయటానికి రెడీ అవుతుందనడంలో ఏ సందేహం లేదు. ఇక ఇప్పటికే 'పైసా వసూల్' మీద బెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. బాలకృష్ణ ఈసారి 'పైసా వసూల్' తో 100  కోట్లు కొల్లగొడతాడని ఫాన్స్ అప్పుడే బెట్టింగ్స్ కాస్తున్నారని మనం ఎప్పుడో చెప్పుకున్నాం కదా. ఆ బెట్టింగ్స్ కట్టిన వారు ఈ సాంగ్ చూసి ధీమాగా కాలర్ ఎగరేసుకోవచ్చు.  

Click Here to see the Paisa Vasool Song

Paisa Vasool Title Song Promo Released:

Superb Response to Balakrishna and Puri Jagannadh Movie Paisa Vasool title Song 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs