Advertisement
Google Ads BL

150 లో చిరుకి, 101 లో బాలయ్యకి.. ?


పూరీ జగన్నాథ్‌ చిత్రాలలో కథకి సంబంధం ఉన్నా లేకున్నా అలీతో ఓ సపరేట్‌ కామెడీ ట్రాక్‌ అయినా ఉంటుంది. 'ఇడియట్‌' చిత్రంలో ఇసుకను మోటార్‌ బైక్‌లతో తీసుకెళ్లే పాత్రలో పోలీసులను బురిడి కొట్టించే వాడిగా, ఇక 'దేశముదురు'లో పోలీసులు, నక్సలైట్లు, జిహాదీల వలలో చిక్కుకు పోతూ, సన్యాసిగా మారిన వేషంతో, 'పోకిరి'లో వేణుమాధవ్‌తో కలిసి బెగ్గర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. 

Advertisement
CJ Advs

కానీ 'టెంపర్‌'లో కుక్కల దొంగగా చేసిన పాత్ర పేలలేదు. ఇక 'ఇజం, లోఫర్‌, రోగ్‌'లలో కూడా అది పెద్ద మైనస్‌ పాయింట్‌ అయింది కానీ పూరీజగన్నాథ్‌ ప్రస్తుతం బాలకృష్ణతో 101 వ చిత్రంగా తెరకెక్కిస్తోన్న 'పైసా వసూల్‌'లో మాత్రం అలీ కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడని, చాలా కాలానికి మరలా పూరీ అలీ పాత్రను ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా, అవుట్‌ అండ్‌ కామెడీగా తెరకెక్చించాడని తెలుస్తోంది. ఇందులో అలీ పోర్చుగల్‌ షెడ్యూల్‌లో కూడా పాల్గొన్నాడు. బాలకృష్ణ -శ్రియాశరన్‌ల మద్య వచ్చే ఆయన పాత్ర అదరగొడుతుందని, ఈ చిత్రం షూటింగ్‌ పోర్చుగల్‌లో జరిగిన సందర్భంగా ఈ చిత్రానికి ప్రొడక్షన్‌లో పనిచేసిన చార్మి, ఆపుకోలేనంతగా పొట్ట చెక్కలయ్యేలా రోజూ పడి పడి నవ్వేదాన్నని చెప్పుకొచ్చింది. మరి ఆమెను అంతలా నవ్వించిన అలీ అందులో 50శాతం థియేటర్లలలో నవ్వించినా చాలు ఇక ఈ సినిమాకి తిరుగేలేదని అంటున్నారు. 

'పైసా వసూల్‌'లో బాలయ్య-అలీల మధ్య వచ్చే కామెడీ పంచ్‌లు, సెటైర్లు అద్భుతంగా ఉంటాయని చార్మి హామీ ఇస్తోంది. అదే జరిగితే ఈ చిత్రం ఎబౌ యావరేజ్‌ టాక్ వచ్చినా సూపర్‌హిట్‌ రేంజ్‌కి వెళ్లడం ఖాయమనే చెప్పాలి. ఇదిలా ఉంటే చిరంజీవి 150 వ చిత్రంలో అలీ.. చిరు పక్కనే నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు బాలయ్య పక్కన చేస్తున్నాడు. ఇది కూడా సక్సెస్ అయితే ఇక స్టార్ హీరోలందరికీ అలీ సెంటిమెంట్ గా అవుతాడని వార్తలు కూడా మొదలయ్యాయి. సో..మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలంటే బాలయ్యకి పైసలు వసూల్ అయ్యేవరకు ఆగాల్సిందే. 

Ali Sentiment to Chiru and Balayya:

Ali Comedy Highlights in Paisa Vasool Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs