హరీష్ శంకర్ తాజాగా 'డీజే' చిత్రంతో కాస్త ఇబ్బందుల్లో పడ్డాడు. సినిమా హిట్ అని చెప్పే ప్రయత్నంలో కలెక్షన్స్ కాస్త ఎక్కువ చెప్పుకొచ్చాడంటూ మెగా ఫాన్స్ అంతా హరీష్ మీద ఒంటికాలితో లేచి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అంతే.. అప్పటినుండి మీడియాకి ఫోకస్ అవ్వకుండా తన పని తాను చూసుకుంటున్నాడు. ఒక కొత్త కథతో త్వరలోనే ఒక సినిమాని దిల్ రాజు నిర్మాతగా పట్టాలెక్కించేపనిలో వున్నాడు హరీష్. అయితే ఈసారి తీసే సినిమాతో కొడితే సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఆ సినిమా స్క్రిప్ట్ ని హరీష్ రెడీ చేస్తున్నాడు గాని..... ఆయనతో సినిమా చేసేందుకు హీరోలెవరు ఇంట్రెస్ట్ చూపడంలేదనేది ఇన్ సైడ్ న్యూస్.
అయితే తనకథకు అందమైన టైటిల్ 'దాగుడు మూతలు' అని పెట్టుకున్న హరీష్ శంకర్ ఇప్పుడా కథతో మల్టీస్టారర్ చెయ్యాలనుకుంటున్నాడట. ఎలాగూ మల్టీస్టారర్ సినిమా అంటే ఆ సినిమాకి ఎటువంటి పబ్లిసిటీ లేకుండా విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. అందులోను టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రానికి ఉన్న ఆదరణ వేరే చెప్పక్కర్లేదు. అందుకే ఇలా మనోడు మల్టీస్టారర్ కి ప్లాన్ చేశాడు. అలాగే ఇద్దరు హీరోలను మెయిన్ లీడ్ గా పెట్టి రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో హరీష్ ఉన్నాడట.
హరీష్ ప్లాన్ బాగానే ఉంది గాని హరీష్ గాలానికి చిక్కే హీరోలెవరు? ఇక ఈ 'దాగుడుమూతలు' సినిమా ఎప్పుడు మొదలుబెట్టబోతున్నారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.