Advertisement
Google Ads BL

ఖాన్ల మాయలో వుండే.. ప్రభాస్‌ని కాదంది!


ప్రభాస్‌ నటిస్తున్న 'సాహో' చిత్రం హీరోయిన్‌ విషయంలో శ్రద్దాకపూర్‌, అనుష్క నుంచి ఎందరి పేర్లో వినిపించాయి. కానీ తొలుత వినిపించిన పేరు మాత్రం కత్రినా కైఫ్‌, వెంకటేష్‌ 'మల్లీశ్వరి'లో మెప్పించి, బాలయ్య సినిమాతో మన మీద పిడుగు వేసింది. ఇక ఆపై మౌనంగాఉంటోంది. కాగా ఇటీవల బాహుబలి తర్వాత మాత్రం తనకు ప్రభాస్‌తో నటించాలని ఉందని 'జగ్గాజాసూస్‌' ప్రమోషన్లలో కూడా చెప్పింది. కానీ ఈమె పరిస్థితి ఇప్పుడు ప్రభాస్‌తో నటించాలని ఉన్నా నటించలేని స్థితిలో ఉందట. 

Advertisement
CJ Advs

ఇటీవల వచ్చిన 'జగ్గాజాసూస్‌' చిత్రం డిజాస్టర్‌ కావడంతో ఆమె బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌ త్రయానికి ఓకే చెప్పేసింది. అమీర్‌ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌లు నటిస్తూన్న విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌'లో నటిస్తోంది. సల్మాన్‌ఖాన్‌తో టైగర్‌ జిందా హై'లో, ఇక షారుఖ్‌ఖాన్‌తో కూడా కలిసి సినిమాలు చేస్తోంది. ఫేడవుట్‌ అయినా తన కెరీర్‌ మరలా ఈ ఖాన్‌ల వల్ల గాడిలో పడుతుందనే ఆశతో ఉంది. 

ఇదే సమయంలో ఆమె రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రణవీర్‌ సింగ్‌ హీరోగా తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'టెంపర్‌' చిత్రంలో కాజల్‌ పోషించిన పాత్రను ఆమెను పోషించమని కూడా ఆఫర్‌ వచ్చిందట. ప్రస్తుతం 'గోల్‌మాల్‌ రిటర్న్స్‌'ని డైరెక్ట్‌ చేస్తోన్న రోహిత్‌ శెట్టి ఈ చిత్రం పూర్తయిన వెంటనే 'టెంపర్‌' హిందీ రీమేక్‌ని మొదలుపెట్టనున్నాడు. కానీ కత్రినాకి మాత్రం డేట్‌ ప్రాబ్లమ్స్‌ అంటున్నారు. ఆమె ఓకే చెబితే వెంటనే అడ్వాన్స్‌ ఇచ్చి అగ్రిమెంట్‌ చేసుకోవడానికి కూడా రోహిత్‌శెట్టి, రణవీర్‌ సింగ్‌లు సిద్దంగా ఉండటంతో ఆమె అయోమయంలో పడిపోయింది. 

తనకు ఎవరు హిట్‌ ఇస్తారో తెలియకపోయినా బాలీవుడ్‌ని ఏలుతున్న ఖాన్‌ త్రయంలోనే ఎవరో ఒకరు తనకు బ్రేక్‌ ఇస్తారని, అంతేగానీ, యంగ్‌స్టార్స్‌లో ప్రయోగాలు చేయడం ఎందుకు? అని ఆమెకు ఆమే ఖాన్‌ల మాయలో పడి ప్రభాస్‌ 'సాహో'ని వదులుకుందట. మరి కనీసం 'టెంపర్‌' రీమేక్‌కైనా ఓకే చెబుతుందో లేదా ఇంకా ఈ రిస్క్‌లు ఎందుకులే.. ఖాన్స్‌నే నమ్ముకుంటే ముగ్గురిలో ఒకరైనా బ్రేక్‌ ఇవ్వకపోతారా? అనే ఆలోచనలో వుందో..!

Katrina Rejected Prabhas Saaho Chance:

Reasond Behind the Katrina Kaif Rejected Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs