Advertisement
Google Ads BL

'బాలకృష్ణుడు' చిలిపి అల్లర్లు స్టార్ట్స్!


సినిమా ఫలితం పట్టించుకోకుండా భగవద్గీతలోని కృష్ణుడి సారమైన కర్మలను చేయడం మానవద్దు అనేదానిని బాగా ఫాలో అయ్యే హీరోలలో నారారోహిత్‌ ఒకడు. ఈమద్య ఆయనకు కాస్త ఫర్వాలేదనే రిజల్ట్‌ లైతే వస్తున్నాయి.. మరోవైపు నటునిగా పేరొస్తోంది గానీ సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. దీంతో నారా రోహిత్‌ ప్రస్తుతం తాను నటిస్తున్న 'బాలకృష్ణుడు'పై ఫోకస్‌ గట్టిగా పెట్టాడు. 

Advertisement
CJ Advs

ఇటీవల చొక్కా గుండీలు వూడదీసి, బరువు తగ్గిన తన సిక్స్‌ప్యాక్‌ బాడీతో ఆయన పోస్టర్‌తో బాగా ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 8వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే ఆయన మంచు మనోజ్‌, నాగచైతన్యలతో ఢీకొనాల్సి వుంటుంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడైన పవన్‌ మల్లెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో టాలీవుడ్‌ బబ్లీ బ్యూటీ రాశీఖన్నా ఓ హస్కీ పాటను స్వయంగా పాడింది. ఈ పాట ఈ చిత్రానికి బాగా ఎస్సెట్‌ అవుతుందని భావిస్తున్నారు. 

గతంలో కూడా ఈ అమ్మడు 'జోరు' చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ని ఎంతో మెచ్యూర్డ్‌గా పాడినా సినిమా ఫలితాన్ని మాత్రం ఈ పాట మార్చలేకపోయింది. ఇక ఇప్పుడు 'బాలకృష్ణుడు' కోసం ఆమె మరోసారి గొంతు విప్పుతోంది. ఇక ఈ అమ్మడు 'జోరు' సమయంలో చిన్న హీరోయినే అయినా ప్రస్తుతం ఆమె రవితేజ సరసన 'టచ్‌ చేసి చూడు', యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా, ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంతో అదరగొట్టేలా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న 'జై లవ కుశ' చిత్రాలలో నటిస్తోంది.

ఈ రెండు చిత్రాలతో ఆమె స్టార్‌ హీరోయిన్‌గ ఎదగడం ఖాయం అనిపిస్తున్న సమయంలో ఆమె నారా రోహిత్‌ కోసం 'బాలకృష్ణుడు'లో ఓ పాట పాడిందంటే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేం. ఆమె ఇలా పాత పాడింది అని తెలిసిన అందరూ 'బాలకృష్ణుడు' కి చిలిపి అల్లరుల్లో ఒకటిగా దీనిని అభివర్ణిస్తుండటం విశేషం. 

Raashi Khanna Sings Song for Balakrishnudu :

Heroine Raashi Khanna Turns singer for Nara Rohit Balakrishnudu movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs