Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ బిగ్ బాస్ బుల్లెట్‌..!


ఎన్టీఆర్ మా ఛానల్ బిగ్ బాస్ షోలో హోస్ట్ గా అదరగొట్టేస్తున్నాడు. మొదట్లో ఎన్టీఆర్ బుల్లితెర పెరఫార్మెన్సు మీద కొద్దిగా డౌట్ పడ్డ వారికి ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్న హోస్ట్ కి ప్రేక్షకులే కాదు విమర్శకులు సైతం ముగ్దులైపోతున్నారు. ఎన్టీఆర్ పెరఫార్మెన్సు లెవెల్స్, ఎనర్జీ లెవల్స్ చూడడానికి వారాంతంలో ప్రేక్షకులు ఎగబడిపోతున్నారు అంటే అతిశయోక్తి లేదు. అంతలా ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో ఆకట్టుకుంటున్నాడు. ఒకపక్క ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మరోపక్క షోలో పార్టిసిపేట్స్ కి ఎనర్జీ బూస్ట్ ఇస్తున్నాడు. ఐదురోజులు షో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ ఎన్టీఆర్ ప్రదర్శించే పెరఫార్మన్స్ నిజంగా సింప్లి సూపర్బ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు.

Advertisement
CJ Advs

బిగ్ బాస్ షో వేదిక మీద ఎన్టీఆర్ చేస్తున్న పెరఫార్మెన్సు కి ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అవుతున్నారనే టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. అంతేకాదు షో వేదిక మీద ఎన్టీఆర్‌ హావభావాలు, ఎనర్జీ, మెచ్యూరిటీ లెవల్స్‌, బాడీ లాంగ్వేజ్‌, స్పాంటేనియస్‌గా వ్యవహరించే తీరు అన్నిటిలో ఎన్టీఆర్ ఇరగదీసేస్తున్నాడు. అన్నిటిలో ఎన్టీఆర్ చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మరి బుల్లితెర మీద ఎన్టీఆర్ 100 పర్సెంట్ సక్సెస్ అయ్యాడనే ఒపీనియన్ కి వచ్చేశారు సదరు ప్రేక్షకులు.  మరి వీకెండ్ వీకెండ్ కి ఎన్టీఆర్ ఇలా షోలో రెచ్చిపోతూ పార్టిసిపేట్స్ కి కూడా ఎనర్జీ ఇచ్చేస్తూ వారిని కూడా డల్ మూడ్ నుండి యాక్టీవిటి మూడ్లోకి మార్చేస్తున్నాడు.

ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ బుల్లెట్‌ మీద కన్పించడం అనేది బిగ్ బాస్ షో మొత్తానికే హైలైట్‌ అని ఢంకా పదంగా చెప్పెయ్యొచ్చు. ఎన్టీఆర్ ని బుల్లెట్ మీద అలా చూస్తుంటే ఉంది చూడంటి అబ్బో అది కేకేనేహే అనిపించేలా వుంది. ఒక గంటన్నర సేపు ఏక ధాటిగా ఏ మాత్రం ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా ఎన్టీఆర్ ఈ షోని హ్యాండిల్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా నడిపిస్తూ షోని మరింతగా రక్తికట్టించడానికి కష్టపడుతున్నాడు. మరోపక్క బిగ్ బాస్ పరిసర ప్రాంతాల్లోనే తన తాజా చిత్రం 'జై లవ కుశ' కోసం షూటింగ్ లో పాల్గొంటూనే ఎన్టీఆర్ ఈ బిగ్ బాస్ కి హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా నాలుగు వారల బిగ్ బాస్ షోని సూపర్ గా రక్తి కట్టించిన ఎన్టీఆర్ మిగిలిన బిగ్ బాస్ షో ని ఇంకెంత ఎనర్జీ తో నడిపిస్తాడో ఎన్టీఆర్ ఇంటిపై ఓ కన్నేసి చూద్దాం..!

NTR Superb Energy in Bigg Boss Show:

NTR 100 Percent Success with Telugu Bigg Boss Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs