Advertisement
Google Ads BL

నితిన్ అసలు నిజం చెప్పేశాడు..!


నితిన్ - హను రాఘవపూడి కాంబోలో వచ్చిన 'లై' చిత్రం గత శుక్రవారమే విడుదలై మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. రీసెంట్ గా 'లై' సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు యూనిట్ సభ్యులు. ఈ సక్సెస్ మీట్ లో హీరో నితిన్ తాను ఈ సినిమా ఎందుకు చేశాను అనే దానిపై, అలాగే 'లై' సినిమా టాక్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. రెండు భారీ సినిమాలతో మా సినిమాని పోటీకి దింపుతున్నాము అనగానే.... 'లై' సినిమా విడుదలకు ముందు రోజు అస్సలు నిద్రే పట్టలేదు. డిఫరెంట్ సబ్జెట్ తో వస్తున్నాం....  మా సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో....  రిజల్ట్ ఎలా ఉంటుందో అని ముందు కాస్త భయపడ్డాం. ఇక సినిమా విడుదలై ఫస్ట్ టాక్ మాకు యుఎస్ నుంచి వచ్చింది. అక్కడనుండి మాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

Advertisement
CJ Advs

మరి అక్కడ ఓకె. కానీ ఇక్కడ తెలుగు ప్రేక్షకుల టాక్ చూసుకుంటే..అంతా మిక్స్ డ్ రెస్పాన్స్. కొంతమంది బావుంది అంటున్నారు. మరికొంతమంది బాగోలేదంటున్నారు. ఇంకొంతమంది పర్వాలేదంటున్నారు. ఆ తర్వాతి రోజు కాస్త పాజిటివ్ టాక్ అందుకుని కలెక్షన్స్ పెరిగాయని 'లై' గురించి నితిన్ చెబుతున్న మాట. సినిమా కథ కొత్తగా వుంది... కాన్సెప్ట్ చాలా బాగుంది అని అనుకుని థియేటర్స్ కి వెళ్లే వాళ్ల సంఖ్య క్రమేపి పెరుగుతూ వచ్చిందని.... అది ఈ వారాంతానికి మరింత పెరిగే అవకాశం ఉంటుందని నితిన్ చెప్పుకొచ్చాడు. ఇక 'అ... ఆ' సినిమా సక్సెస్ తర్వాత ఏదో ఒక ప్రేమ కథని తీసుకుని సినిమా చేసేయ్యొచ్చు. అలాగే నాలుగు పాటలు, నాలుగు ఫైట్స్ తో రొటీన్ స్టోరీ కి ఓకె చెప్పెయ్యొచ్చు. కానీ నేను ఈసారి ఏదన్న కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయ్యాను.

అందుకే హను చెప్పిన 'లై' కొత్త కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా కి ఓకె చేశాను. అలాగే అనవసరమైన కామెడీ, పాటలు, యాక్షన్ వద్దు అవసరమైతేనే అవన్నీ పెట్టమని హనుతో చెప్పానని కూడా చెబుతున్నాడు. అలా మా కాంబినేషన్ లో కొత్తదనంతో కూడుకున్న 'లై' స్టార్ట్ అయ్యింది. ఉన్నది ఉన్నట్టు తియ్యి మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మార్చొద్దని హనుకి చెప్పడంతో హను కూడా ముందు అనుకున్న కథనే ప్రెజెంట్ చెయ్యడంతో సినిమా ఇప్పుడు హిట్ అయ్యిందని నితిన్ 'లై' సినిమా చెయ్యడానికి గల కారణాలు, ఆ సినిమాకి వస్తున్న టాక్ పై ఇలా క్లారిటీ ఇచ్చాడన్నమాట.

Nithiin Talks About Lie Movie:

Nithiin Speech at Lie Movie Thank You Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs