Advertisement
Google Ads BL

'స్పైడర్‌' విలన్ కి ఎందుకింత భయం?


మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రం 'స్పైడర్‌'. సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య మెయిన్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్‌లో సూర్య విలనీ రేంజ్‌ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో మరో యంగ్‌ హీరో, 'ప్రేమిస్తే' ఫేమ్‌ భరత్‌ కూడా యంగ్‌ విలన్‌గా నటించనున్నాడు. 

Advertisement
CJ Advs

తెలుగులో మొదటి సారిగా స్ట్రెయిట్‌ చిత్రం అవకాశం రావడం, మహేష్‌బాబు, మురుగదాస్‌ల వల్లనే ఈ చిత్రంలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నానని, ఇకపై ఎంత పెద్ద చిత్రంలో విలన్‌ పాత్ర వచ్చినా చేయనని, హీరోగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. తాజాగా భరత్‌ మరోసారి అదే మాటను చెబుతున్నాడు. మొత్తానికి ఈ చిత్రంలో యంగ్‌ విలన్‌గా నటిస్తున్న తనకు ఇక నుంచి అలాంటి పాత్రలే వస్తాయనే భయంతోనే ఆయన ఈ విధంగా పదే పదే అదే మాటను చెబుతున్నాడని, ఆయన ప్రస్తుతం అభద్రతాభావంలో ఉన్నాడని అంటున్నారు. 

ఇక ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుండటం వల్ల ప్రతి సీన్‌ని రెండు సార్లు చేయాల్సి వచ్చేదని, తెలుగు రాకపోవడం వల్ల తాను ఎక్కువ టేక్స్‌ తీసుకుని, ఆలస్యం చేసినా మహేష్‌ బాబు ఎంతో సహనంతోనే ప్రవర్తించాడని మహేష్‌ని ఈ యంగ్‌ హీరో అండ్‌ విలన్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. మొత్తానికి ఈ 'స్పైడర్‌' చిత్రం ఈయనకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో వేచిచూడాల్సివుంది....! 

Spyder Villain Bharat Fear with Spyder Villain Role:

Youngh Hero Bharath About Spyder movie Villain Role 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs