Advertisement
Google Ads BL

కాజల్ ఎక్సట్రా కే..ఎక్కువ..!


కాజల్ ముందుగా తేజ డైరెక్షన్ లోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా ఎలా వున్నా కాజల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగి దశాబ్ద కాలం పాటు తన హవా కొనసాగించింది. ఇక తేజ మీద ఉన్న అభిమానంతోనే కాజల్, రానా కి జోడిగా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటించింది. మరి కాజల్ ఈ సినిమాలో నటిస్తుంది అనేసరికి  ఆ సినిమాపై మంచి అంచాలనే వచ్చేశాయి. ఎప్పుడూ గ్లామర్ పాత్రలో దూసుకుపోయే కాజల్ ఈ చిత్రంలో చీరకట్టు అందాలతో  అదరగొట్టేసింది. రాధా కేరెక్టర్ లో హోమ్లీగా ఒదిగిపోయింది. 

Advertisement
CJ Advs

ఇక సినిమా పబ్లిసిటీ విషయంలో కూడా కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' చిత్ర టీమ్ వెంటే ఉండి సినిమా కోసం ప్రచారం చేసింది. రానాతో కలిసి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో పర్యటించి 'నేనే రాజు నేనే మంత్రి' గురించిన ప్రచారంలో పాల్గొంది. సినిమా కోసం చాలా కష్టపడింది కాజల్. దానికి తగ్గ ఫలితం కూడా ప్రేక్షకులు ఇచ్చేశారు. తనతో పాటు విడుదలైన 'లై, జయ జానకి నాయక' ల కంటే 'నేనే రాజు నేనే మంత్రి' కలెక్షన్ పరంగా కూడా టాప్ ప్లేస్ లో వుంది. అయితే ఎప్పుడూ సినిమాల ప్రమోషన్స్ గురించి పెద్దగా పట్టించుకోని కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' కోసం విపరీతంగా ప్రచారంలో పాల్గొనడం చూసిన అందరికి కొంచెం డౌట్ వచ్చేస్తుంది.

మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా ఎక్కువగా కాజల్ కి ఇవ్వబట్టే ప్రచారంలో ఇలా పాల్గొందనే టాక్ బయటికి వచ్చింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ ఈ చిత్రం ప్రమోషన్ కి అక్షరాలా 30 లక్షలు అందుకుందని....అందుకే ఇలా ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొందని అంటున్నారు. అయితే ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ అందరూ ఇలానే బిహేవ్ చేస్తున్నారు. సినిమా కోసం భారీ పారితోషకం అందుకుంటూనే ప్రమోషన్స్ కోసం మరికొంత నిర్మాతల నుండి గుంజేస్తున్నారు.

Extra Remuneration for Kajal Nene Raju Nene Mantri Promotion:

Kajal Agarwal 30 Lakhs High Remuneration for Nene Raju Nene Mantri Promotion
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs