Advertisement
Google Ads BL

'స్పైడర్' లాస్ట్ లో ఉన్నాడు..!


మహేష్ - మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం సెప్టెంబర్ 27  న విడుదల తేదీ ప్రకటించారు 'స్పైడర్' మేకర్స్. ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకో పాట మినహా షూటింగ్ కంప్లీట్ అంటూనే ఉన్నారు కానీ ఆ పాట షూటింగ్ మాత్రం ఇంకా మొదలెట్టలేదు. మొదటి నుండి 'స్పైడర్' విషయంలో తాత్సారం చేస్తున్న మురుగదాస్ ఇప్పుడు టీజర్ విషయంలో కొంచెం స్పీడందుకున్నాడని అంటున్నారో లేదో మరోవైపు 'స్పైడర్' పాట షూటింగ్ విషయంలో ఇంకా స్లోగానే ఉన్నాడంటున్నారు. 

Advertisement
CJ Advs

రకుల్ ప్రీత్ తో జోడి కడుతున్న మహేష్ ఈ చిత్రంలో స్పై గా నటిస్తున్నాడు. ఇక మహేష్ - రకుల్ లపై ఈ నెల 23  నుండి మిగిలి ఉన్న ఆ పాట చిత్రకరణ మొదలెట్టనున్నాడు మురుగదాస్. అయితే ఈ పాటని ఫారిన్ లొకేషన్ అయిన రొమానియాలో చిత్రీకరించనున్నారు. యూరప్ దేశమైన రోమానియా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. 'స్పైడర్' సాంగ్ ఇలాంటి లొకేషన్లో రూపుదిద్దుకోనుందంటే ఖచ్చితంగా విజువల్ ట్రీట్ గా ఉంటుందని చెప్పొచ్చంటున్నారు.

ఇక ఈ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ కి పేకప్ చెప్పేసి మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల మీద చిత్ర యూనిట్ దృష్టిసారించనుంది. వచ్చే నెల రెండో వారంలో 'స్పైడర్' ట్రైలర్ ని విడుదల చేస్తారనే టాక్ కూడా వినబడుతుంది. ఇప్పటి వరకు టీజర్లు తోనే దుమ్మురేపుతున్న మహేష్ 'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ తో ఇంకెంత రచ్చ చేయనుందో అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో తమిళ నటులు ఎస్ జె సూర్య ఒక విలన్ కాగా హీరో భరత్ కూడా విలన్ రోల్ లోనే కనిపించనున్నాడు.

Spyder Movie Last Song Shoot in Romania!:

Meanwhile, last song of the film is planned for shoot in Romania in last week of this month which puts an end to major production parts except few patch works.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs