Advertisement
Google Ads BL

ఈ నిర్మాత సామాన్యుడు కాదండోయ్..!


మీనా హీరోయిన్ గా ఒకవెలుగు వెలిగి కాస్త లేట్ గానే పెళ్ళి చేసుకుని ఒక కూతుర్ని కన్నాక కూడా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో, సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకొచ్చింది. అయితే మొన్న మధ్యన 'దృశ్యం'లో ఇద్దరు పిల్లలకి తల్లిగా కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు మరొకసారి మీనా అలాంటి రోల్ లోనే టాలీవుడ్ చిత్రంలో కనబడబోతుందంటూ చెబుతున్నారు.

Advertisement
CJ Advs

ఇక బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం భారీ నటీనటుల్ని అతని సినిమాలో నటింపచేయడానికి అన్నిటికి సిద్ధపడతాడు. వారిని భారీ రెమ్యునరేషన్ తో పడేస్తుంటారు. నిన్నటికి నిన్న 'జయ జానకి నాయక' కోసం రకుల్, ప్రగ్య, కేథరిన్, శరత్ కుమార్, జగపతి బాబు, వాణి విశ్వనాద్ వంటి టాప్ స్టార్స్ ని తీసుకొచ్చిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు శ్రీవాస్ డైరెక్షన్ లో శ్రీనివాస్ చెయ్యబోయే చిత్రం కోసం పూజ హెగ్డేని హీరోయిన్ గా దించుతూనే మరో సీనియర్ హీరోయిన్ మీనాని శ్రీనివాస్ కి తల్లిగా ఏరికోరి సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు.

దర్శకుడు శ్రీవాస్ - హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రంలో హీరో తల్లి పాత్రకు మీనాను తీసుకున్నట్లు ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. సినిమా కథలో హీరో చిన్ననాటి ఎపిసోడ్ లో తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండడంతో... ఆ పాత్రకి మీనా లాంటి స్టార్ మదర్ అయితే బాగుంటుందని దర్శకుడు శ్రీవాస్ భావించి.... సురేష్ ద్వారా ఆమెని అప్రోచ్ అయ్యి ఆమెకు కథ చెప్పి ఒప్పించారట. అయితే ఇప్పటికే హీరోగారి చిన్ననాటి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయినట్లు చెబుతున్నారు. కేవలం చిన్ననాటి ఎపిసోడ్ కే మూడున్నర కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ చైల్డ్ ఎపిసోడ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉండి ఉంటుంది. అందుకే మీనా కూడా మారు మాట్లాడకుండా ఒప్పుకుని ఉంటుందంటున్నారు. 

మరి 'జయ జానకి నాయక' లో వాణి విశ్వనాధ్ కోసం భారీగా ఖర్చుపెట్టిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు మీనాకెంత ఇవ్వబోతున్నాడో అనేది హాట్ టాపిక్ గా మరింది.

Bellamkonda Sreenivas Next Movie With Director Sriwass:

Bellamkonda Sreenivas new movie with Director Sriwass. Senior actress Meena selected this movie hero mother character role.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs