Advertisement
Google Ads BL

తమ్ముడూ..ఇప్పుడు కూడా పైసలోసూల్ కావా!


'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం తర్వాత బాలకృష్ణ, కృష్ణవంశీ డైరెక్షన్ లో 'రైతు' సినిమాలో నటిస్తాడనుకున్నారు. కానీ ఆ కాంబినేషన్ అటకెక్కేసింది. అనూహ్యంగా పూరి - బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా సెట్ అవడమూ.. సెట్స్ మీదకెళ్ళడం జరిగిపోయాయి. మరి పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్నాడు అంటే..... బాలకృష్ణ ఈ సినిమాలో ఏ రేంజ్ లో కనబడతాడో అని అభిమానులకు భయం పట్టుకుంది. ఆ భయాన్నీ కంటిన్యూ చేస్తూ పూరి, బాలయ్యల సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లు వదిలారు. సినిమా టైటిల్ 'పైసా వసూల్' అంటూ బాలయ్యని రఫ్ లుక్ లో చూపించే సరికి బాబోయ్ బాలయ్య ఏందయ్యో... పూరి డైరెక్షన్ లో ఇలాంటి సినిమా చేస్తున్నాడనుకున్నారు.

Advertisement
CJ Advs

మళ్ళీ అదే భయాన్ని కంటిన్యూ  చేస్తూ పూరి జగన్నాధ్ సినిమాని ఆఘమేఘాల మీద కంప్లీట్ చేసేసి విడుదల తేదీ కన్నాముందే అంటే నెల రోజుల ముందే సినిమాని తయారు చేసి విడుదలకు సిద్ధం అన్నాడు. ఈదెబ్బకి నందమూరి అభిమానులు బిక్క చచ్చిపోయారు. కానీ పూరి వదిలిన వెరైటీ 'పైసా వసూల్' స్టంపర్ తో 'పైసా వసూల్' మీద ఉన్న అనుమానాలన్నీ పటా పంచలవడమే కాదు ఇప్పుడు వదిలిన మేకింగ్ వీడియో తో పూర్తిగా తమ మైండ్ సెట్ మార్చేసుకుని 'పైసా వసూల్' గ్యారెంటీ హిట్ అంటున్నారు. స్టంపర్ లో బాలకృష్ణ ఎనర్జీ చూసిన వారికి పిచ్చెక్కిపోయింది. అలాగే పూరి మార్క్ రఫ్ డైలాగ్స్ ని బాలయ్య చించి అవతల పడేసాడు. బాలయ్య డైలాగ్ డెలివరీ కాస్త డల్ గా వుందన్నప్పటికీ.... ఆ డైలాగ్స్ ని బాలయ్య అలా చెబుతుంటే మాత్రం ఆ కిక్కే వేరప్పా అంటున్నారు ఇప్పుడు. 

ఇక మేకింగ్ వీడియోలో అయితే బాలకృష్ణ ఎనర్జీని చూస్తుంటే మాత్రం బాలకృష్ణ పైకి అంత వయసుందా అనిపిస్తుంది. అప్పట్లో హీరోయిన్స్ శ్రియ, కైరా లు బాలకృష్ణ ఎనర్జీ గురించి చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోని జనాలు ఇప్ప్పుడు ఈ మేకింగ్ లో బాలయ్య ఎనర్జీకి పడిపోతున్నారు. అంత వయసులోనూ బాలయ్య అలసట లేకుండా యాక్షన్ సీన్స్ లో అదరగొడుతున్నాడు. బాలయ్య  వర్షం ఎఫెక్ట్ లో నల్లని ఓవర్ కోట్ వేసుకొని గొడుగును చేతిలో తిప్పుతుంటే మళ్ళీ పదేళ్ళు వెనకకు వెళ్ళినట్లు కనిపిస్తున్నాడు అంటూ కితాబునిచ్చేస్తున్నారు. మరి ఇప్పటివరకు 'పైసా వసూల్' బిజినెస్ పరిస్థితి బాగోలేదంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్లే అంటున్నారు. ఈదెబ్బకి 'పైసా వసూల్' కి పైసల్ రాలడం గ్యారెంటీ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Click Here to see the Paisa Vasool Stumper Making Video 

Paisa Vasool Making Video Released :

Balakrishna and Puri Jagannadh Movie Paisa Vasool Stumper Making Video Hulchal in Social Media 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs