Advertisement
Google Ads BL

హైబ్రిడ్ పిల్ల..ఇలాంటి పీసులు లేరండీ బాబూ!


టాలీవుడ్ లోకి వచ్చి రావడంతోనే బంపర్ హిట్ కొట్టిన 'ఫిదా' భామ సాయి పల్లవి స్వతహాగా డాక్టర్. 'ఫిదా' చిత్రంలో భానుమతిగా అదరగొట్టేసి కురాళ్ళ గుండెల్లో గుడి కట్టించేసుకున్న ఈ భామ ఇప్పుడు నానితో 'ఎంసీఏ' చిత్రంలో నటిస్తుంది. 'ఫిదా' కి వచ్చిన క్రేజ్ తో సాయి పల్లవికి సినిమా అవకాశాలు కూడా వెల్లువలా వచ్చిపడుతున్నాయి. దర్శకనిర్మాతలు సాయి పల్లవి ఇంటిముందు తమ సినిమాల్లో నటించమని క్యూకట్టేస్తున్నారట. కానీ సాయి పల్లవి మాత్రం సినిమాలో తన పాత్ర నచ్చితేనే చేస్తానని అందులోను ఎడాపెడా సినిమాలు ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పేస్తుంది కూడా. కథ నచ్చకపోతే ఎక్కువ పారితోషకం ఇచ్చినా సినిమా చెయ్యనని చెప్పి షాకిస్తున్న సాయి పల్లవి ఇప్పుడు మరొక షాకిచ్చింది.

Advertisement
CJ Advs

'ఫిదా' సినిమాతో ఒక్కసారిగా వచ్చిన స్టార్ డమ్ ని అమ్మడు క్యాష్ చేసుకోవాలనుకోవడంలేదు. ఎలా అంటే..  'ఫిదా' కి వచ్చిన క్రేజ్ తో సాయి పల్లవికి సినిమాల్లోని అవకాశాలు రావడమే కాదు షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా వెల్లువలా  వచ్చిపడుతున్నాయట. అమ్మడు జనాల్లో బాగా ఫెమస్ కావడం వల్ల కొన్ని ప్రముఖ వాణిజ్య కంపెనీలు వారి కొత్త కంపెనీ బ్రాంచిల ప్రారంభోత్సవాలకు రమ్మని రిక్వెస్ట్ చేశారట. అలాగే కొంత డబ్బు కూడా ముట్టజెబుతామని ఆమె ముందు.. ప్రస్తావించడంతో అమ్మడు నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. అందులోను డబ్బులు కోసం నచ్చని పనులు చెయ్యనని నిర్మొహమాటంగా చెప్పేస్తుందట. 

ఇలాంటి పనులు డబ్బు కోసం చెయ్యాల్సిన అవసరం తనకి లేదని కాకపోతే ఎవరైనా చారిటి ట్రస్ట్ లకు గాని, అనాధ పిల్లల కోసం ఏవైనా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తే తనవంతు సాయంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అక్కడికి సంతోషంగా వస్తానని చెప్పేస్తూ.. 'ఫిదా' భామ సాయి పల్లవి అందరిని నిజంగానే 'ఫిదా' చేసేస్తుంది. నిజంగా సాయి పల్లవిని చూస్తుంటే ముచ్చటేస్తుంది కదూ.. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో హీరోయిన్స్ దొరికిందే ఛాన్స్ అనుకుంటూ.. డబ్బు దండుకోవడానికి అస్సలు వెనుకాడడంలేదు. ఏదన్నా పని చెయ్యాలి అంటే అది డబ్బుతోనే జరగాలని పట్టుబట్టుకుని కూర్చునే ఈ రోజుల్లో సాయి పల్లవి లాంటి అమ్మాయి చాలా అరుదుగా కనిపిస్తుంది కదా! హైబ్రిడ్ పిల్ల కదా..ఇలాంటి పీస్ ఒక్కటే ఉంటది మరి..!

Fidaa Fame Sai Pallavi Real Character:

Fidaa Heroine Sai Pallavi Have Great Qualities 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs