నేటి సూపర్‌స్టార్ మహేష్‌బాబు బాలనటునిగా ఉన్నప్పుడు 'పోరాటం, ముగ్గురు కొడుకులు, కొడుకుదిద్దిన కాపురం, గూఢచారి 117' వంటి చిత్రాలలో తన తండ్రి, నాటి సూపర్‌స్టార్ కృష్ణ చిత్రాలలో నటించాడు. ఇక ఆయన చిన్నవయసులోనే 'బాలచంద్రుడు' సినిమాలో లీడ్ రోల్ చేసినా ఆ చిత్రం ఆడలేదు. ఇక మహేష్ బాబు ప్రిన్స్‌గా పూర్తి స్థాయిలో హీరోగా మారిన తర్వాత ఆయన నటించిన మొదటి చిత్రం 'రాజకుమారుడు, వంశీ, టక్కరిదొంగ' వంటి చిత్రాలలో కృష్ణ కనిపించాడు.
'రాజకుమారుడు' జస్ట్ యావరేజ్ కాగా, 'వంశీ, టక్కరి దొంగ' చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో కృష్ణ మహేష్‌బాబు చిత్రంలో నటిస్తే ఆ చిత్రం ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఒకే చిత్రంలో ఈ ఇద్దరు అసలు కనిపించలేదు. ఇక కృష్ణ ఈ మద్య పెరిగిన వయసు, సరైనా కథలు రాకపోవడం, అనారోగ్య సమస్యల వల్ల సినిమాలలో పెద్దగా నటించడం లేదు. 'బలాదూర్'తో పాటు ఇటీవల 'శ్రీశ్రీ' చిత్రంలో నటించాడు. ఇక తండ్రికొడుకులు కలిసి నటిస్తే ఫ్లాప్ అనే సెంటిమెంట్‌కు ప్రస్తుతం చెక్ పెట్టడానికి మహేష్‌బాబు, కొరటాల శివను నిర్ణయించుకున్నారు.
వీరిద్దరి కాంబినేషన్‌లో 'శ్రీమంతుడు' తర్వాత చేస్తున్న 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్‌బాబు ఓ యువ సీఎం పాత్రను పోషిస్తుండగా, ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకునిగా ఉదాత్తమైన పాత్రలో కృష్ణ నటించనున్నాడని సమాచారం. అదే జరిగితే ఏకంగా 18 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై తండ్రి, కొడుకులైన ఇద్దరు సూపర్‌స్టార్స్ కలిసి నటించి, ఘట్టమనేని అభిమానులనే కాక నేటితరం వారికి కూడా కను విందు చేయనుండటం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది.