ఆగష్టు 11 న థియేటర్స్ లో కొచ్చిన 'లై, జయ జానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు వేటికవే విభిన్న చిత్రాలుగా ప్రేక్షకులను మెప్పించే పనిలో ఉన్నాయి. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కినవి కాబట్టే ఒకేరోజు పోటీకి సిద్దపడ్డాయి. 'లై' చిత్రం మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో దూసుకుపోతుంటే, 'జయ జానకి నాయక' యాక్షన్ ఎంటెర్టైనర్ గా అదరగొడుతుంది. ఇక రానా 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం పొలిటికల్ పంచ్ లతో ఇరగదీస్తోంది. మూడు సినిమాల్లో ఏది హిట్టంటే అప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి. మొదటి రోజు మూడు సినిమాలు పాజిటివ్ టాక్ తో బాగానే ఆకట్టుకున్నాయి.
మరి మొదటి రోజు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ చిత్రాల అసలు భాగోతం మొదటి వీక్ కలెక్షన్స్ బయటికి వచ్చాకే చెప్పగలమంటున్నారు. మరి జెన్యూన్ గా మూడు చిత్రాల కలెక్షన్స్ ని ఆయా చిత్రాల నిర్మాతలు బయటపెడతారా? లేకుంటే మా సినిమా గొప్పంటే మా సినిమా గొప్పంటూ బడాయిలు పోతారో కొద్దిగా వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. ఏదిఏమైనా ఒకే రోజు బరిలోకి దిగిన ఈ మూడు భారీ బడ్జెట్ చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు... పాజిటివ్ రివ్యూస్ తో కూడా మూడు చిత్రాలు థియేటర్స్ లో దంచేస్తున్నాయి.
నితిన్ న్యూ లుక్ తో 'లై' సినిమా మైండ్ గేమ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇక 'జయ జానకి నాయక' చిత్రాన్ని బోయపాటి తనదైన మాస్ స్టయిల్ తో యాక్షన్ సినిమాగా మలిచాడు. ఈ చిత్రంలో బోయపాటి మార్క్ డైలాగ్స్ కి మాస్ ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక మూడో చిత్రం రానా పొలిటికల్ లీడర్ గా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో తేజ అందించిన పొలిటికల్ డైలాగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి రావడం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. మరి ఓవరాల్ గా ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ విషయంలో మళ్లీ సంక్రాంతి ని రిపీట్ చేసి, 'ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి' తలపించినట్లుగా అయితే బాక్సాఫీస్ వద్ద తెలుస్తుంది.