Advertisement
Google Ads BL

పూర్తిగా.. బాలయ్యలా మారిన జగన్..!


పూరి డైరెక్షన్ లో బాలయ్య వినడానికే మొదట్లో షాకింగ్ గా వున్న విషయం.... ఇప్పుడు మాత్రం ఆ కాంబినేషన్ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. బాలకృష్ణ కి పూరి చెప్పిన కథ అంత బాగా నచ్చిందా? లేకుంటే పూరి డైరెక్షన్ లో బాలయ్య ఏంటండీ బాబు అన్నవారే ఇప్పుడు ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలు చూశాక నోరెళ్లబెడుతున్నారు. వీరి కాంబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్దమైంది. ఈ షూటింగ్ జర్నీలో బాలయ్య బాబు తో సినిమా చెయ్యడం నాకెంతో సంతోషంగా ఉందని.... ఇప్పటివరకు బాలకృష్ణ గారిని ఎందుకు డైరెక్ట్ చెయ్యలేకపోయానా అని బాధపడుతున్నానని చెప్పే పూరి ఇప్పుడు బాలయ్యకు ఫ్యాన్ ని అని చెప్పుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

బాలకృష్ణ మీద తనకి ఎంత అభిమానం వుందో తాజాగా ఒక ఫోటో ద్వారా బయటపెట్టాడు. ఆ పిక్ లో బాలకృష్ణ పక్కనే చైర్ వేసుకుని..... సేమ్ బాలకృష్ణ మాదిరిగా కళ్ళకు కళ్ళజోడు, నోట్లో సిగార్, కాలిమీద కాలేసుకుని అంతా బాలయ్య స్టయిల్లో దర్శనమిస్తూనే... ఆ పిక్ పైన ఐ యామ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ ఎన్‌బికె.. ఐ హేవ్‌ 101 ఫీవర్‌ అంటూ రాసి ఆ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మరి ఆ పిక్ ని చూస్తుంటే బాలయ్య పక్కన మరో బాలయ్య కూర్చున్నట్టు ఉందంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక 'పైసా వసూల్' స్టంపర్ తో రచ్చ చేసిన పూరి - బాలయ్యలు ఈసారి ఈనెల 17 న జరిగే ఆడియో, ట్రైలర్ ద్వారా ఇంకెంత రచ్చ చేయనున్నారా అని బాలకృష్ణ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. శ్రియ, కైరా, ముస్కాన్ లతో బాలయ్య ఆడిపాడనున్నాడు.

Director Puri Jagannadh becomes Balayya fan:

Paisa Vasool has completely transformed Puri Jagan. He has become a 101 per cent fan of Balakrishna.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs