ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేడు అన్ని భాషల వారు అతిలోక సుందరి శ్రీదేవి పెద్దకుమార్తె జాహ్నవి కపూర్ వైపు చూస్తున్నారు. గతంలో జాహ్నవి. రామ్‌చరణ్‌తో 'జగదేక వీరుడు- అతిలోక సుందరి' చిత్రం రీమేక్ ద్వారా పరిచయం అవుతోందని, నిర్మాత అశ్వనీదత్ కూడా శ్రీదేవితో ఆ విషయమై చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇక అక్కినేని అఖిల్ సరసన నటించనుంది అనే వార్తలను నాగార్జున తోసిపుచ్చాడు. ఇక శ్రీదేవి మాత్రం తన కుమార్తెను కేవలం బాలీవుడ్ ద్వారానే తెరంగేట్రం చేయించడం ఖాయమని వార్తలు వచ్చాయి. ఈ బాధ్యతలను ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ చేతిలో పెట్టిందని, ఆయన ధర్మ ప్రొడక్షన్స్ ద్వారానే జాహ్నవి పరిచయం అవుతుందని, మరాఠి చిత్రం సైరత్ రీమేక్ ద్వారా ఆమె ఎంట్రీ ఉంటుందని ఇలా చాలా వార్తలు వస్తున్నాయి.
ఇక ఇంకా సినిమాలలో అడుగే పెట్టని జాహ్నవి పలు వేడుకల్లో, పబ్‌లలో బోయ్‌ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ చేస్తూ, బాగా ఎంజాయ్ చేస్తూ వార్తల్లోకి ఎక్కుతోంది. శ్రీదేవి మాత్రం తన కూతురిని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేవరకు ఇలా వార్తల్లో ఉండవద్దని వార్నింగ్ ఇచ్చిందని కూడా అన్నారు. కానీ జాహ్నవి జోరు మాత్రం సామాన్యంగా లేదు. అటు సచిన్ టెండూల్కర్ కూతురితో కలసి ఓ బోయ్‌ఫ్రెండ్‌తో చిందులేస్తూ కనిపించింది. మరోసారి ఆమె బోయ్‌ఫ్రెండ్ ఏకంగా శ్రీదేవి, ఆమె కూతురు జాహ్నవిలతో ఒకే కారులో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇక ఇటీవల ఆమె ఓ వేడుకలో రణబీర్ కపూర్ వెంట తిరుగుతూ, ఎంజాయ్ చేస్తుండటంతో ఈ విషయం పతాక శీర్షికలకి ఎక్కింది. దీనిని శ్రీదేవి తాజాగా ఖండించింది.
ఇది ఒకందుకు మంచిదేనని, ఓ స్టార్‌కిడ్‌గా ఇలాంటి గాసిప్స్ సహజమేనని, కాబట్టి ఆ విషయాలు లైట్‌గా తీసుకోవాలని తన కుమార్తెకు చెప్పిందట. ఇక తన కూతురు ఎంట్రీపై తానే త్వరలో ప్రకటిస్తానని అంటోంది. ఇలా ఆమె ఏళ్ల నుంచి చెబుతూనే ఉంది. చివరకు అతి జాగ్రత్తతో ఆమె తమిళ 'పులి', హిందీ 'మామ్' చేసినట్లుగా కమర్షియల్ ఫ్లాప్ చిత్రాలను ఎంపిక చేస్తోందా? అనే అనుమానం వస్తోంది. జాగ్రత్త మంచిదే అయినా అతి జాగ్రత్త మాత్రం ప్రమాదకరమని ఆమెకి ఎప్పుడు తెలుస్తుందో చూడాలి...!