Advertisement
Google Ads BL

నెంబర్ 1 ప్లేస్ మహేష్ ది కాదు..!


మహేష్ బాబు నటించిన 'స్పైడర్' టీజర్ ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో మహేష్ చాలా అందంగా ఉండడం... యాక్షన్ సీన్స్ లో ఇరగదియ్యడం... విలన్ గా నటిస్తున్న ఎస్ జె సూర్య చాలా క్రూయల్ గా కనిపించడం, రకుల్ ప్రీత్ సింగ్.. మహేష్ కి ముద్దు పెట్టడం వంటివాటితో 'స్పైడర్' టీజర్ బాగానే ఆకట్టుకుంది. మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న 'స్పైడర్' చిత్రం షూటింగ్ ఒక పాట మినహా  పూర్తికావొచ్చింది. ఇక తాజాగా విడుదలైన 'స్పైడర్' టీజర్ యూట్యూబ్ లో సంచలనాలను నమోదు చేస్తుంది. ఇప్పటివరకు యూట్యూబ్ లో స్పైడర్ టీజర్ కోటి వ్యూస్ తో రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది.

Advertisement
CJ Advs

అయితే 'స్పైడర్' టీజర్ మాత్రం ఎన్ని రికార్డులు కొల్లగొడుతున్నా రెండో స్థానానికే పరిమితమయ్యిందంటున్నారు. ఎలా అంటే ఎన్టీఆర్ - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న 'జై లవ కుశ' సినిమాలోని 'జై' టీజర్ కేవలం 24 గంటల్లోనే అత్యధికంగా 4.98 మిలియన్ వ్యూస్ సాధించింది. మరి మహేష్ 'స్పైడర్' టీజర్ 24 గంటల్లో 4.04 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. మరి దీనిబట్టి ఎన్టీఆర్ 'జై' టీజర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా... 'స్పైడర్' టీజర్ మాత్రం రెండో స్థానంలో కొనసాగుతుంది. అలాగే 'స్పైడర్' చిత్రం రెండు భాషల్లోనూ తెరకెక్కుతుంది కాబట్టి యూట్యూబ్ వ్యూస్ ని రెండు భాషలకు కలిసే చెబుతున్నారు. 

ఆ రెండు భాషలకు కలిపి 'స్పైడర్' టీజర్ కి 8.6 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెబుతున్నారు. అందులోను ఫేస్ బుక్, యూట్యూబ్ వ్యూస్ కలిపి ఇంత వ్యూస్ వచ్చినట్టు చెబుతున్నారు. మరి దీనినిబట్టి 'స్పైడర్' తెలుగు వెర్షన్ కు సంబంధించిన లెక్కలు చూసుకుంటే మాత్రం ఎన్టీఆర్ 'జై' టీజర్ దే టాలీవుడ్ లో మొదటి స్థానం అంటున్నారు. ఈ లెక్కన మహేష్, ఎన్టీఆర్ ని బీట్ చెయ్యలేదన్నమాట. ఈ లెక్కన మొదటి, రెండు స్థానాల్లో జై లవ కుశ, స్పైడర్ ఉండగా.... మూడో స్థానంలో 'కాటమరాయుడు', నాలుగో స్థానంలో 'డీజే', ఐదవ స్థానంలో 'సాహో' వున్నాయి.

Mahesh Spyder Teaser got Second Place:

Top Teaser Views List in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs