Advertisement
Google Ads BL

ఈ పోలీసైనా బాక్సాఫీస్ దగ్గర నిలబడతాడా!


'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తర్వాత యంగ్‌హీరో సందీప్‌కిషన్‌కి సరైన హిట్‌ లేదు. ఇక ఆమద్య విడుదలైన 'శమంతకమణి' ఓకే అనిపించినా అది మల్టీహీరోల చిత్రం, 'మానగరం' తమిళంలో బాగానే ఆడినా తెలుగులో మాత్రం పబ్లిసిటీ, ప్రమోషన్లు లేకపోవడంతో ఆడలేదు. ఎన్నో ఆశలుపెట్టుకున్న కృష్ణవంశీ 'నక్షత్రం' ఉసూరు మనిపించింది. దాదాపు రెండేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. 

Advertisement
CJ Advs

ఇక ప్రస్తుతం ఆయన మహేష్‌బాబు సోదరి మంజుల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. గౌతమ్‌మీనన్‌ నిర్మాతగా కార్తిక్‌నరేన్‌ దర్శకత్వంలో 'నరకాసురుడు' చేస్తున్నాడు. ఇక ఆయన నటిస్తున్న మరో చిత్రం 'మాయావన్‌'. ఈ చిత్రం టీజర్‌ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ కూడా రిలీజైంది. ట్రైలర్‌లోని కంటెంట్‌, ట్రైలర్‌ని కట్‌ చేసిన విధానం సూపర్బ్‌గా ఉన్నాయి. అభిరుచి ఉన్న నిర్మాత సి.వి.కుమార్‌ దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ఇది కావడంతో తమిళంలో మంచి అంచనాలే ఉన్నాయి. 

ట్రైలర్‌ని చూస్తే సీరియల్‌ కిల్లర్‌ని పట్టుకునే ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా ఇందులో సందీప్‌కిషన్‌ కనిపించనున్నాడని అర్ధమవుతోంది. ఇక 'నక్షత్రం'లో పోలీస్‌ పాత్ర సినిమా హిట్‌ కాకపోవడంతో ప్రజల్లో నోటీస్‌ కాలేదు. కానీ నిజానికి సందీప్‌కిషన్‌ ఒడ్డుపొడవు, ఇతర విషయాలలో ఆయన కటౌట్‌ ఖచ్చితంగా పోలీస్‌ పాత్రలకు సూట్‌ అవుతుంది. కాగా ఇదే చిత్రాన్ని తెలుగులో 'ప్రాజెక్ట్‌ జడ్‌'గా విడుదల చేయనున్నారు. మరి ఈ మూడు చిత్రాలైనా సందీప్‌కిషన్‌కి ఓదార్పునిస్తాయో లేదో వేచిచూడాల్సివుంది...! 

Sundeep Kishan Police Role in Maayavan Movie :

Sundeep Kishan Maayavan Tamil Trailer Released 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs