రజనీకాంత్‌కి వీరాభిమానులు తమిళనాటే కాదు.. తెలుగు రాష్ట్రాలలో కూడా ఉన్నారు. కానీ రజనీకాంత్‌కి 'శివాజీ, రోబో'ల తర్వాత మరో హిట్ రాలేదు. ఆ తర్వాత వచ్చిన 'కొచ్చాడయాన్, లింగ' చిత్రాలు బాగా నిరాశపరిచాయి. ఇక తమిళంలో బాగా ఆడిన 'కబాలి' చిత్రం తెలుగులో మాత్రం సరిగా ఆడలేదు. ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా 30కోట్లకు పైగానే నష్టం తెచ్చింది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో '2.0' చేస్తున్నాడు. ఇందులో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తుండగా, అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏకంగా ప్రమోషన్స్‌తో కలిసి 450కోట్ల బడ్జెట్‌తో ఇండియాలోనే ఒకే పార్ట్‌గా అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇక అక్షయ్‌కుమార్ వల్ల ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
మరోవైపు రజనీ నటించిన వరుస చిత్రాలు బాగా నష్ట పరుస్తున్నా కూడా దాని ఎఫెక్ట్ '2.0' పై మాత్రం ఏమాత్రం పడటం లేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన బిజినెస్‌ని చేస్తోంది. సినిమా విడుదలకు ఇంకా ఎంతో కాలం సమయం ఉన్నా ఇప్పటినుంచే ఈ చిత్రం కొనడానికి బయ్యర్లు భారీ ఫ్యాన్సీ ధరలతో ముందుకొస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూడా భారీ బిజినెస్‌ని చేసింది. ఈ చిత్రాన్ని గ్లోబల్ మూవీస్ సంస్థ భారీ ధరకు హక్కులను తీసుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఈ చిత్రం రికార్డు స్థాయిలో మునుపెన్నడూ కనివినీ ఎరుగని ధరకు అమ్ముడైందని ఆయన తెలిపాడు. ఇక 'బాహుబలి' చిత్రం రికార్డులనే కాదు.. 'దంగల్' వసూళ్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసే సత్తా ఈ '2.0'కి మాత్రమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు వెర్షన్ హక్కులను సొంతం చేసుకున్న గ్లోబల్ మూవీస్ సంస్థ 'కొచ్చాడయాన్, లింగ, కబాలి'ల ద్వారా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకే ఈ చిత్రాన్ని ఇస్తారా? లేక దానితో సంబంధం లేకుండా ఈ చిత్రం క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటరా? అనేది వేచి చూడాల్సివుంది...!