Advertisement
Google Ads BL

మహేష్ మస్త్ గా గొడుతుండు..!


మహేష్ బాబు - మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం విడుదలకు రంగం సిద్ధం చేస్తూనే పబ్లిసిటీ స్టంట్ స్టార్ట్ చేసింది. మహేష్ పుట్టినరోజు కానుకగా 'స్పైడర్' సెకండ్ టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ విషయమై కాస్త గందరగోళమే ఏర్పడింది. ఎందుకంటే ఈ టీజర్ '1 నేనొక్కడినే' టైప్ లో ఎవ్వరికి అర్ధమవలేదనే కామెంట్స్ పడుతున్నాయి. కేవలం ఇంటిలిజెంట్ బ్రైన్స్ కి మాత్రమే 'స్పైడర్' టీజర్ అర్ధమవుతుందని.... బిసి సెంటర్స్ కి 'స్పైడర్' సినిమా ఎలా అర్ధమవుతుందంటూ కొత్త వాదనకు తెర తీశారు కొందరు. ఈ టీజర్ లో 'స్పైడర్' కథ ఏమిటనేది రివీల్ కాకుండా మురుగదాస్ అతి జాగ్రత్త వల్లనే ఈ టీజర్ అర్ధం కాలేదనే వాదన వినబడుతుంది. మరి మహేష్ అభిమానులేమో మహేష్ బాబు ఎంతో అందంగా వున్నాడని టీజర్ కేక అని అంటున్నారు. కేవలం మహేష్ అభిమానులే కాదు వెబ్ మీడియా, సోషల్ మీడియాలో కూడా 'స్పైడర్' టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక 'స్పైడర్' టీజర్ యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. 

Advertisement
CJ Advs

మరి పైన చెప్పినట్టు 'స్పైడర్' టీజర్ లో భారీతనం తప్ప కొత్తదనంలేదనే  విమర్శలొస్తున్నప్పటికీ.... 'స్పైడర్' సినిమా టీజర్ మాత్రం సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. మరి ఈ దూకుడుతోనే 'స్పైడర్' టీజర్ యూట్యూబ్లో కోటి వ్యూస్ కి చేరువైంది. ఇతర హీరోల టీజర్లు, ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడు వారి ఫ్యాన్స్ చేసి హడావుడి చూసిన మహేష్ ఫ్యాన్స్..ఇప్పుడు మస్త్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మా వోడు రికార్డుల్ని మస్త్ గా గొడుతుండు..అంటూ తమ అభిమానం చాటుకుంటున్నారు. తెలుగు తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మురుగదాస్ ఎప్పటినుండో మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. మహేష్ స్పై పాత్ర లో కనిపించనున్న ఈచిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ కి జోడిగా, ఎస్ జె సూర్య 'స్పైడర్' లో విలన్ గా భరత్ వంటి హీరో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నారు.

Spyder New Teaser's Record Views:

Ever since the new teaser of Spyder was unveiled, viewers have gone berserk watching its superb visuals and interesting content which resulted record views generated in a short span of time.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs