రానా హీరోగా నటించిన 'నేనే రాజు - నేనే మంత్రి' ఈరోజు శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా ఇప్పుడు అది విడుదల కాకుండా ఆగిపోయింది. పెద్ద సినిమాతో పోటీ పడి బరిలోకి దిగుదామనుకుని ఇప్పుడు థియేటర్స్ దొరక్క సైలెంట్ గా వెన్నక్కి తగ్గింది 'నేనే రాజు నేనే మంత్రి'. అదేమిటి 'లై, జయ జానకి నాయక' చిత్రాలపై యుద్దానికి దిగిన 'నేనే రాజు నేనే మంత్రి' ఇప్పుడు సడన్ గా విడుదల ఆగిపోవడం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఈ సినిమా తెలుగులో కాదు తమిళ్ లో. పక్కన తమిళనాడు రాష్ట్రంలో 'నేనే రాజు నేనే మంత్రి' విడుదల కాకుండా ఆగిపోయింది. తెలుగుతో పాటే ఆగష్టు 11 న తమిళంలోనూ విడుదల చేద్దామనుకున్న సురేష్ బాబుకి ధనుష్ షాకిచ్చాడు.
ఈ శుక్రవారమే తమిళంలో ధనుష్ నటించిన 'విఐపి 2' చిత్రం కూడా విడుదలవుతుంది. ఆ చిత్రం తమిళనాట భారీ స్థాయిలో విడుదల కావడంతో 'నేనే రాజు నేనే మంత్రి'కి థియేటర్ల కొరత ఏర్పడడం మూలంగా అక్కడ విడుదల ఆపేసినట్లు చెబుతున్నారు. మరి తెలుగులో అయితే 'లై, జయ జానకి నాయక' చిత్రాలు విడుదలవుతున్నప్పటికీ సురేష్ బాబు వ్యూహంతో కావాల్సినన్ని థియేటర్స్ దక్కించుకుని ఆ సినిమాలకు పోటీగా వచ్చేసింది 'నేనే రాజు నేనే మంత్రి'. ముందుగా 'లై, జయ జానకి నాయక' చిత్రాలు డేట్స్ బుక్ చేసుకున్నప్పటికీ కొంచెం లేట్ గా 'నేనే రాజు నేనే మంత్రి' డేట్ అనౌన్స్ చేసినా థియేటర్స్ కొరత లేకుండా సురేష్ బాబు తెలివిగా ప్లాన్ చేసాడు.
కానీ అక్కడ తమిళనాట సురేష్ బాబు పప్పులు ఉడకలేదు . అక్కడ ధనుష్ హావాని తట్టుకోవడం కష్టమై సైలెంట్ అయ్యింది. మరి 'లై' నిర్మాతలు, 'జయ జానకి..' నిర్మాతలు సురేష్ బాబుకి ఎంత చెప్పిన విడుదల ఆపని సురేష్ ఇప్పుడు తమిళనాట 'నేనే రాజు నేనే మంత్రి' విడుదల చెయ్యలేక వాయిదా వేసుకున్నాడని కామెంట్స్ పడుతున్నాయి. ఇక 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం తమిళనాట ఎప్పుడు విడుదల కానుందో త్వరలోనే డేట్ ఎనౌన్స్ చేస్తారని చెబుతున్నారు.