Advertisement
Google Ads BL

'సాహో' అప్ డేట్ అదిరింది..!


'బాహుబలి' కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్లు కేటాయించాడు. ఎంత టైం కేటాయిస్తేనేం అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని చవిచూశాడు. పేరుకి పేరు, డబ్బుకి డబ్బు ప్రభాస్ కి దక్కాయి. జాతీయస్థాయిలో ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. మరి 'బాహుబలి' లో ప్రభాస్ చేసిన నటనకు ప్రభాస్ అభిమానులే కాదు అందరూ ఫిదా అయిపోయారు. ఇక బాహుబలి అర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్టు ని సుజిత్ డైరెక్షన్ లో యూవీ క్రియేషన్స్ వారికి చేస్తున్నాడు. 'బాహుబలి' విడుదల రోజునే 'సాహో' చిత్ర టైటిల్, టీజర్ తో వచ్చేశాడు ప్రభాస్. అప్పుడే అన్నారు అందరూ  ప్రభాస్ స్పీడందుకున్నాడని.

Advertisement
CJ Advs

ఇక 'సాహో' షూటింగ్ మొదలెట్టడము.... కొన్ని రోజుల షూటింగ్ కూడా జరగడం మాత్రమే కాదు ఏకబిగిన ఆరు నెలల్లో 'సాహో' షూటింగ్ కంప్లీట్ చెయ్యాలనే కృత నిశ్చయంతో చిత్ర యూనిట్ ఉన్నట్లు చెబుతున్నారు. అదేమిటి ఇప్పటివరకు 'సాహో' కి సంబందించిన ఒక్క న్యూస్ బయటికి రాలేదు. ఇప్పుడేమో సడన్ గా 'సాహో' మరో ఆరు నెలల్లో విడుదలవుతుందని చెబుతున్నారేంటి అనుకుంటున్నారు కదా?  ప్రభాస్‌ లేకుండానే కొన్నిరోజులు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఏకబిగిన మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామని 'సాహో' చిత్ర సినిమాటోగ్రాఫర్‌ 'మది' చెబుతున్నాడు. 

మరి ఆయన  చెప్పినట్లు 'సాహో'ని ఆరు నెలల్లో కంప్లీట్ చెయ్యడం సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుంది అందరిలో.  అయితే ఒకవైపు వైపు సినిమా నిర్మాణం...... ఇంకో వైపు విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ తో 'సాహో' చిత్ర యూనిట్ బిజీగా ఉందట. మరి దీన్ని బట్టి 'మది' చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఈ లెక్కన ప్రభాస్ కేవలం 'సాహో' కోసం నాలుగు నెలలు డేట్స్ కేటాయిస్తే సినిమా మొత్తం పూర్తవుతుందన్నమాట. 'బాహుబలి' విషయంలో స్లో అయిన ప్రభాస్ 'సాహో' విషయంలో మాత్రం యమా స్పీడుమీదున్నాడంటున్నారు.

Saaho Shooting Update:

Cameraman Madi talks about Saaho Movie Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs