Advertisement
Google Ads BL

శ్రీమంతుడ్ని చూసి బాలీవుడ్‌ హీరోలు మారారు!


మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన 'శ్రీమంతుడు' చిత్రంలో 'తిరిగిచ్చేయాలి..లేకపోతే లావైపోతారు' అనే డైలాగ్‌ని ఇప్పుడు బాలీవుడ్‌ టాప్‌ హీరోలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. విషయంలోకి వస్తే..బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తను నటించి డిజాస్టర్‌ అయిన 'ట్యూబ్‌లైట్‌' చిత్రం కొన్న కొనుగోలుదారులకి కొంత తిరిగిచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. 

Advertisement
CJ Advs

సల్మాన్‌ నటించిన 'ట్యూబ్‌లైట్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌ అయ్యింది. దీంతో ఈ చిత్రాన్ని కొన్నవారంతా దారుణంగా నష్టపోయారు. ఇది తెలిసిన సల్మాన్‌ వారిని ఆదుకునేందుకు రూ. 32.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేందుకు ముందుకు రావడంతో..ఇప్పుడు సల్మాన్‌ ని బాలీవుడ్‌ ఇండస్ట్రీ పొగడ్తలతో ముంచెత్తుతుంది. 

సల్మాన్‌తో పాటు షారుఖ్‌ ఖాన్‌ కూడా తన చిత్రం 'జబ్‌ హ్యారీ మెట్‌ సేజల్' కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత డబ్బుని తిరిగిచ్చేయనున్నాడని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో కొంత తిరిగిచ్చేయాలి మరి. లేదంటే లావైపోరూ..! 

Salman and Shahrukh Returns money to Distributors:

Salman Khan returns Rs. 32.5 Crores to distributors for Tubelight; Will Shah Rukh Khan follow suit for Jab Harry Met Sejal?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs