Advertisement
Google Ads BL

బోయపాటి ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి..!


బోయపాటి - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటికి ఉన్న క్రేజ్ తో  ఈ సినిమా భారీ అంచనాలతోనే బరిలోకి దిగుతుంది. బోయపాటి మార్క్ స్టయిల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడిగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, కేథరిన్ తెరిస్సా ఒక ఐటెం సాంగ్ లో నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంది. నార్మల్ గా బోయపాటి సినిమాలంటే ఇటు యూత్, అటు మాస్‌ని.. ఇంకోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయనే టాక్ ఉంది.

Advertisement
CJ Advs

ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలోనే జరిగింది. అయితే ఇప్పుడు 'జయ జానకి నాయక' శాటిలైట్ రైట్స్ కూడా ఊహించని రేంజ్‌కి అమ్ముడుపోయినట్లు చెబుతున్నారు. తెలుగులో స్టార్ మా 5 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ని సొంతం చేసుకోగా..... ఇక ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ని 7 కోట్లకు సోనీ నెట్‌వర్క్ దక్కించుకున్నట్టు టాక్ వినబడుతుంది. మరి 'జయ జానకి నాయక' చిత్రం శాటిలైట్, హిందీ డబ్బింగ్ హక్కులు ఈ రేంజ్ లో అమ్ముడు పోవడం చూసిన ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారట.

అయితే ఈ సినిమాకి ఛానల్స్ లో అంత హైప్ రావడానికి కారణం మాత్రం డైరెక్టర్ బోయపాటే అంటున్నారు విశ్లేషకులు. ఆయనకున్న ట్రాక్ రికార్డు వలనే ఈ రేంజ్ కి 'జయ జానకి నాయక' అమ్ముడు పోయిందని వారు వాదిస్తున్నారు. శాటిలైట్ రైట్స్ ఈ విధంగా వెళ్లడం రిలీజ్‌కి ముందు నిర్మాతకు బిగ్ రిలీఫ్. అయితే ఈ లెక్కన 'జయ జానకి నాయక' చిత్రం హిట్టయినా ఆ క్రేజ్ అంతా బోయపాటి పట్టుకుపోతాడు. ఇక మిగిలిన బెల్లంకొండ శ్రీనివాస్ కి కేథరిన్ కి ప్రగ్య కి పెద్దగా ఒరిగేదేమి ఉండదు దీని వలన. చూద్దాం సినిమా విడుదలయ్యాక టాక్ ని బట్టి ఏదనేది డిసైడ్ చేస్తే పోలా..!

Jaya Janaki Nayaka Movie Satellite Rights Sensation :

<span>5 Crores Satellite Rights and 7 Crores Dubbing Rights to Boyapati Srinu Jaya Janaki Nayaka movie.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs