టాలీవుడ్ లో ఫ్యామిలీల ప్రభావం చాలా ఎక్కువని..ఎక్కువమందికి తెలుసు. అందులో మెగా, నందమూరి ఫ్యామిలీలంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఈ రెండు ఫ్యామిలీలు టాలీవుడ్ లో సంథింగ్ స్పెషల్. ఈ ఫ్యామిలీల హీరోల చిత్రాలు విడుదల అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద వుండే హడావుడి అలాంటిలాంటిది కాదు. అయితే ఈ ఫ్యామిలీలకు కొందరు డైరెక్టర్స్..ఫ్యామిలీ డాక్టర్స్ గా ముద్రపడ్డారంటే అతిశయోక్తి కాదు.
నందమూరి ఫ్యామిలీ అనగానే గుర్తొచ్చే డైరెక్టర్ ఎవరయ్యా అంటే..వెంటనే అందరూ ఏం చెప్తారు..బోయపాటి శ్రీను అనేగా. మరి మెగా ఫ్యామిలీ అంటే గ్యారంటీగా వి వి వినాయక్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఈ బంధం అంత ధృడమైనది. ఒక్కోసారి వీరిద్దరూ ఈ ఫ్యామిలీలను దత్తత తీసుకున్నారా అనిపిస్తుంది కూడా..! బాలకృష్ణ కి హిట్స్ లేని టైం లో బోయపాటి దిమ్మతిరిగే హిట్ సింహా రూపం లో ఇచ్చాడు. ఆ తరువాత ఎన్టీఆర్ తో దమ్ము, మళ్లీ బాలయ్య తో లెజెండ్ రూపంలో సెన్సషనల్ హిట్ ఇచ్చాడు. బాలయ్యతో ముచ్చట తీర్చుకునేందుకు మూడో సారి కూడా రెడీగా వున్నానంటూ..ఆల్రెడీ సిగ్నల్ కూడా పంపించాడు.
ఇక వినాయక్ విషయానికి వస్తే..చిరంజీవి తో ఠాగూర్ చేసిన వినాయక్..ఆ చిత్రంతో మెగా ఫ్యామిలీ తో మంచి బంధాన్ని ఏర్పరచుకుని ఆ తర్వాత అల్లు అర్జున్ తో బన్నీ, బద్రీనాథ్, రామ్ చరణ్ తో నాయక్ వంటి చిత్రాలు చేశాడు. రీసెంట్ గా చిరు 150 వ చిత్ర అవకాశం అందిపుచ్చుకుని మంచి మెమరబుల్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ మెగా హీరోతోనే సినిమా తెరకెక్కిస్తూ..మెగా ఫ్యామిలీ ని దత్తత తీసుకున్నాడా అనిపించేలా వినాయక్ తన జర్నీ ని సాగిస్తున్నాడు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే వినాయక్ జర్నీ మొదలైంది మాత్రం నందమూరి ఫ్యామిలీతోనే అనేది మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఆది, చెన్నకేశవ రెడ్డి వినాయక్ మొదటి రెండు చిత్రాలు.