స్టార్ మా ఇప్పుడు నెంబర్ 1 ఛానల్. బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేసింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ షోకి మంచి క్రేజ్ రావడమే కాదు ఛానల్ కి సూపర్ టీఆర్పీ కూడా వచ్చింది. ఎన్టీఆర్ కున్న క్రేజ్ ఈ షోకి విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. అయితే ఆ క్రేజ్ కేవలం శని ఆదివారాల్లో మాత్రమే వస్తుందనే టాక్ ఉన్నప్పటికీ షో మిగతా రోజులలో కూడా మొదట్లో కన్నా ఇప్పుడు కొంచెం బావుందనే టాక్ ప్రేక్షకుల నుండి వినబడుతుంది. వీక్ మిడిల్ లో మొదట్లో చప్పగా సాగిన బిగ్ బాస్ షో రాను రాను కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. కారణం షో లో జరిగే టాస్క్ లు, ఇంకా పార్టిసిపేట్స్ మనస్పర్థలు ఇలాంటి వాటితో షోని బాగానే రక్తి కట్టిస్తున్నారు.
అయితే ప్రేక్షకులకి కేవలం ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మాత్రమే వద్దట. బిగ్ బాస్ షో లో ఒక అందాల సుందరి కూడా ఉంటే బావుంటుంది. మరి ఇది వరకు ఇలాగే సంపూర్ణేష్ ప్లేస్ లోకి అనుకోని అతిధిగా దీక్ష పంత్ వచ్చి చేరింది. కానీ దీక్ష అందాలు కూడా సరిపోవంటున్నారు. నిజంగానే ప్రేక్షకులు అంటున్నారంటే అనుకోరు మరి. బయట ఫంక్షన్స్ లో గట్రా మోడరన్ డ్రెస్సుల్లో మెరిసిపోయే నటీమణులు ఈ బిగ్ బాస్ షోలో మాత్రం నైట్ ఫాంట్స్, నైటీస్, ఫుల్ ఫ్యాన్ట్స్, షర్ట్స్ తో కనిపిస్తుంటే ప్రేక్షకులు మాత్రం ఎన్నాళ్ళు చూస్తారు. అందుకే బిగ్ షోలో ఒక కొత్తందం కావాలంటూ షో కి మెయిల్స్ గట్రా పంపించే పనిలో ప్రేక్షకులు ఉన్నారు.
మరి ప్రేక్షకుల విన్నపాన్ని మన్నించి షో నిర్వాహకులు ఈసారి ఎవరో ఒక హీరోయిన్ ని ఈ బిగ్ షోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పంపాలనే యోచన చేస్తున్నారని టాక్. మరి మొన్నటికి మొన్న తేజస్వినిగాని, హంసానందిని గాని వస్తుందనుకుంటే అప్పుడు సడన్ గా దీక్ష పంత్ ని దింపారు. మరి ఇప్పుడు గ్లామర్ షో చేసి మెప్పించే ఏ హీరోయిన్ ని తీసుకురాబోతున్నారో గాని ఆమెని షోలో చూసేవరకు..... ఈ షోలో పాల్గొనబోయే హీరోయిన్ ఈమె అంటూ ఎన్ని పేర్లు తెరమీదకొస్తాయో చూద్దాం.