Advertisement
Google Ads BL

సాయి ధరమ్ 'ఖైదీ..నాయక్'..!


సాయి ధరమ్ తేజ వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసం గెస్ట్ రోల్ అంటూ చేసిన 'నక్షత్రం' సినిమా కూడా బాగా దెబ్బేసింది. ఈ దెబ్బతో సాయి ధరమ్ తేజ ఇమేజ్ కి బాగా డ్యామేజ్ ఏర్పడిపోయింది. అందుకే ఈసారి వి. వి. వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసి మాస్ హిట్ కొట్టాలని బాగా ఫిక్స్ అయ్యాడు. అటు వినాయక్ కి కూడా స్టార్ హీరోలతో అవకాశాలు రాక సాయి తో ఫిక్స్ అయ్యాడు. ఇక వీరి కాంబినేషన్ లో మూవీ ఆఫీషియల్ గా పట్టాలెక్కేసింది కూడా. మరి సాయి 'జవాన్' సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే వెంటనే వినాయక్ సినిమా షూటింగ్ కి జంప్ అవుతాడు.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమా మెగాస్టార్ చిరు ఆశీస్సులతో ప్రారంభమవడమే కాదు ఆయన చిత్రం 'ఖైదీ నెంబర్ 150' తరహాలోనే ఉండబోతుందంటూ ప్రచారము మొదలైంది. 'ఖైదీ...' కి మాటల రచయితగా పనిచేసిన ఆకుల శివ .... వినాయక్ - సాయి సినిమా కోసం 'ఖైదీ నంబర్ 150 , నాయక్' సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్నాడట. అయితే 'ఖైదీ...' చిత్రాన్ని చిరు హీరోగా తెరకెక్కించిన వినాయకే....'నాయక్' చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి సాయి ధరమ్, వినాయక్ డైరెక్షన్ లో చెయ్యబోయే ఈ చిత్రం 'ఖైదీ నెంబర్ 150 , నాయక్' లను గుర్తు తెచ్చేదిగా ఉంటుందని అంటున్నారు. 

మరి వినాయక్ తన సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ కే ప్రాధాన్యత ఇస్తాడు. కొన్ని సినిమాల్లో కామెడీ కి ప్రాధాన్యతనిచ్చినా కూడా తాజా ఖైదీ లో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. అందుకే ఈసారి సాయి ధరమ్ తో చేసే సినిమాలో వినాయక్ కామెడీకి పెద్ద పీట వెయ్యనున్నాడనే టాక్ వినబడుతుంది. ఇక ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ సరసన మొదటిసారి లావణ్య త్రిపాఠి నటిస్తుంది.

VV Vinayak and Sai Dharam Tej Movie Story Line:

Aakula Siva says Khaidi No 150 and Naayak are inspiration to Vinayak and Sai film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs