Advertisement
Google Ads BL

ఆరపోసింది..కానీ, పాపం ఏం లాభం..?


సినిమాల్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం కాస్త సాంప్రదాయంగా కనబడుతూ.... రాను రాను హీరోయిన్స్ అందాల ఆరబోతలో శృతి మించి పోతున్నారు. హీరోయిన్స్ అలా శృతి మించడానికి వారికుండాల్సిన కారణాలు వారికున్నాయి. అలా సాంప్రదాయంగా కనబడితే మంచి పేరొస్తుంది గాని స్టార్ హీరోల పక్కన మాత్రం ఛాన్స్ లు రాకపోవడం.... కేవలం ట్రెడిషనల్ లుక్ లో చుడీదార్స్, చీరలు, లంగా ఓణీలు అంటూ మడి కట్టుకుని కూర్చుంటే ఆఫర్స్ రావని... గ్లామర్ షో చేస్తే మాత్రం అవకాశాలు వాటంతట అవే వస్తాయని భావించి హీరోయిన్స్ ఇలా బికినీ తదితర షోలతో రెచ్చిపోతున్నారు. ఈ రకమైన కల్చర్ ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీలోనే కనబడుతుంది.

Advertisement
CJ Advs

ఇలా ముందు పద్దతిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిన్నమొన్న వచ్చిన సినిమాలో స్కిన్ షో చేసినా ఉపయోగం లేకుండా పోయి ఉసురు మంటుంది ఒక హీరోయిన్. ఆమె ఎవరో కాదు రెజీనా కాసాండ్రా. రెజీనా సినిమాల్లో కొచ్చినప్పుడు ఎంతో పద్దతిగా కొన్ని సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలు సూపర్ హిట్స్ కాకపోయినా యావరేజ్ హిట్స్ తో రెజినాకు మంచి పేరొచ్చింది. అయితే ఆమెకు చిన్న హీరోల సినిమాల్లోనే అవకాశాలు రావడం, పెద్ద హీరోల పక్కన అవకాశాలు రాకపోవడంతో స్కిన్ షో చేస్తే అయినా అవకాశాలు దండుకోవచ్చని గ్లామర్ షో చెయ్యడం స్టార్ట్ చేసింది. అయితే ఆమె సింపుల్ లుక్ లో ఉన్నప్పుడు ఇష్టపడిన ప్రేక్షకులు గ్లామర్ చేసినప్పుడు మాత్రం విమర్శించడం మొదలు పెట్టారు. 

రెజీనా ఫుల్ గా అందాల ఆరబోతకు దిగిన 'రా రా క్రిష్ణయ్య, నక్షత్రం' సినిమాలు రెండు డిజాస్టర్స్ కావడంతో ఆమె గ్లామర్ షోకి అస్సలు పనికిరాకపోగా... ఇక ఆమెకి అవకాశాలు వస్తాయంటే కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు సినిమాల్లోనూ విపరీతంగా అందాలు హద్దు లేకుండా ఆరబోయడం ఆ సినిమాలకు ఎటువంటి హెల్ప్ చేయలేకపోయాయి. ఇలా ఒకపక్క ప్లాపు అవడం ఒక ఎత్తైతే.... మరోపక్క ఐరెన్ లెగ్ అందాలు అనే కామెంట్స్ రెజీనా మీద వినబడుతున్నాయి. ఈలెక్కన రెజీనాకి అందాల ఆరబోత, గ్లామర్ షో అనేది అస్సలు కలిసిరాదేమో...?

Regina Glamour Show in Ra Ra Krishnaiah and Nakshatram:

Negative talk on Regina Glamour Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs