'డిజె' విజయం, ఫలితం ఏమో గానీ ఈ చిత్రం ద్వారా హరీష్‌శంకర్, దిల్‌రాజు, అల్లుఅర్జున్‌లు సంచలనాలకు కేంద్రంగా మారారు. ఇక ఇందులో హరీష్‌శంకర్ వాటానే అధికం. ఇక తన తదుపరి చిత్రాన్ని ఆయన కాన్సెప్ట్ ఓరియంటెండ్‌గా చేస్తానని చెప్పాడు. ఇటీవల అమెరికాలో లోకేషన్లు చూడటానికి వెళ్లి ఆ ఫొటోలను పోస్ట్ చేశాడు. కాగా ఈ చిత్రానికి ఆయన 'దాగుడుమూతలు' అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు సమాచారం.
ఈయన చెప్పిన స్టోరీ నిర్మాత దిల్‌రాజుకి బాగా నచ్చడంతో ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని తెలుస్తోంది. మరోపక్క ఇందులో ఇద్దరు యంగ్‌హీరోలు ఉంటారట. కథానుసారం నేచురల్‌స్టార్ నాని-శర్వానంద్‌లైతే బాగుంటుందని భావించి దిల్‌రాజుకు చెప్పాడట. ఇక ప్రస్తుతం నాని.. దిల్‌రాజు-వేణుశ్రీరాంల కాంబినేషన్‌లో 'ఫిదా' హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న 'ఎంసీఏ' చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నాడు.
శర్వానంద్.. మారుతితో 'మహానుభావుడు' తో బిజీ బిజీ. ఇక నాని దీని తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఇవ్వన్నీ చూస్తే ఈ 'దాగుడుమూతలు' కాస్త ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక 'నేను లోకల్'తో నానికి, 'శతమానంభవతి'తో శర్వానంద్‌కి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దిల్‌రాజు బేనర్‌లో చేయడమంటే ఈ హీరోలు ఎలాగైనా డేట్స్ సర్దుబాటు చేసుకుని నటిస్తారనేది కూడా నిజమే.