Advertisement
Google Ads BL

'స్పైడర్' టీజర్ టాకేంటి.. ఇలా వుంది?


మహేష్ బాబు పుట్టినరోజు ఆగష్టు 9 న మురుగదాస్, మహేష్ అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. 'స్పైడర్' చిత్రం రెండో టీజర్ ని మహేష్ అభిమానులకి ప్రత్యేకంగా అందించాడు డైరెక్టర్ మురుగదాస్. మొదటినుండి 'స్పైడర్' విషయంలో తాత్సారం చేసిన డైరెక్టర్ ఇప్పుడు కొంచెం స్పీడు పెంచేశాడు. సినిమా విడుదల టైం దగ్గర పడడంతో 'స్పైడర్' కి సంబందించిన పాటలను, టీజర్స్ ని, మహేష్ బాబు లుక్స్ ని ఒక్కొక్కటిగా బయటికి వదులుతూ 'స్పైడర్' పై విపరీతమైన అంచనాలు పెంచేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక 'స్పైడర్' టీజర్ లోకి వద్దాం. ఈ టీజర్ లో మహేష్ బాబు సూపర్ క్లాస్ లుక్ లో విలన్స్ ని ఇరగ్గొట్టేస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా ఉంటాడో అలా కనిపిస్తున్న మహేష్ బాగా క్లాస్ గా కనిపిస్తున్నాడు. అయితేనేమి ఆ ముఖంలో రౌద్రం చూస్తుంటే మాత్రం మాస్ అభిమానులను కూడా డిజప్పాయింట్ చెయ్యడనిపిస్తుంది. ఇక విలన్ ఎస్ జె సూర్య మాత్రం పెరుగుతున్న జనాభాను అతలాకుతలం చేస్తూ చంపేయడం... జనాలను విపరీతమైన భయాందోళనలకు గురిచేయడం వంటివి చూస్తుంటే విలన్ కేరెక్టర్ ని హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేశారనిపిస్తోతుంది. మరి విలన్ అంత భయానకంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే హీరో ఊరుకుంటాడా... మాకు భయపెట్టడం తెలుసంటూ భారీ డైలాగ్ చెప్పేటప్పుడు మహేష్ ముఖంలో కనిపించిన రౌద్రం మాత్రం అదిరిపోయింది.

ఇక హీరోయిన్ తో మహేష్ చేసే రొమాన్స్ అంటే..... రకుల్, మహేష్ కి ముద్దుపెట్టడం వంటివి చూస్తుంటే మాత్రం ఈ సినిమా ఒక సోషియో పొలిటికల్ డ్రామా మాత్రమే కాదు రొమాంటిక్ యాంగిల్ కూడా బాగా వుంటుందనే ఫీలింగులోకి నెట్టేశాడు డైరెక్టర్ మురుగదాస్. మరి టీజర్లోనే 'స్పైడర్' ని బీభత్సంగా ఉండబోతుందని హింట్ ఇచ్చిన మురుగదాస్.. వచ్చే ట్రైలర్ విషయంలో ఇంకెంత చూపించబోతున్నాడో అంటూ మహేష్ అభిమానులు అప్పుడే పండుగ చేసేసుకుంటున్నారు. మురుగదాస్ 'స్పైడర్' విషయంలో ఆలస్యం చేస్తే చేశాడు గాని మంచి కిక్కిచ్చాడంటూ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Click Here to see The Teaser

Spyder Teaser Talk:

Finally, the day has come and here we have the much anticipated Spyder teaser out into market.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs