Advertisement
Google Ads BL

బాబోయ్.. ఇలా ట్వీట్ చేశాడు..!


ఎప్పుడూ సైలెంట్ గా గుంబనంగా తన పని తానూ చేసుకుపోయే కొరటాల శివ ఈ మధ్యన తరుచు వార్తల్లో నిలుస్తున్నాడు. మొన్నటికి మొన్న డ్రగ్స్ మహమ్మారి కన్నా అవినీతి అనేదే పెద్ద సమస్య అని...... ప్రభుత్వాలు అవినీతి నిర్మూలన చెప్పట్టాలని సోషల్ మీడియాలో ఘాటుగా రాసుకొచ్చాడు. అయితే కొరటాల శివ ఇప్పుడు ఇలా ఉన్నట్టుండి స్పందించడానికి కారణం మాత్రం  తాను మహేష్ తో చెయ్యబోతున్న 'భారత్ అనే నేను' చిత్రంకి సంబందించిన కాన్సెప్ట్ ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదుగాని మహేష్ తో చేసే సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్ళిపోయి రెగ్యులర్  షూటింగ్ కూడా స్టార్ చేసేశాడు కొరటాల.

Advertisement
CJ Advs

ఆ తర్వాత కొరటాల మళ్లీ సైలెంట్ గా తన పని చేసుకుంటూ  ఇప్పుడు సడన్ గా ప్రస్తుత రాజకీయాలపైనా తన అభిప్రాయాన్ని మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ప్రస్తుత రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా కుళ్లిపోయాయని.... దేవుడు కూడా ఈ కుళ్లు రాజకీయాలను బాగు చేయలేడు అంటూ ఘాటైన వ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు. అంతే కాకుండా కేవలం మనం మాత్రమే ఈ కుళ్ళు రాజకీయాలను సరైన దారిలోకి తీసుకురాగలమని కూడా సూచిస్తున్నాడు. మరి మహేష్ తో చేస్తున్న సినిమా కథకి ఇప్పుడు కొరటాల చేసిన వ్యాఖ్యలకు ఎమన్నా దగ్గర సమబంధం ఉందంటారా..? అంటే అవుననే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అంటే ఈసారి తన సినిమాలో రాజకీయాలకు సంబందించిన ఏదో... మెస్సేజ్ ని కొరటాల మనకి అందించబోతున్నాడనేది మాత్రం అర్ధమవుతుంది.

కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ బాబు పొలిటిషన్ గా.. ఇంకా సీఎం కేరెక్టర్ లో నటిస్తున్నాడని.... ప్రచారం జరుగుతున్న వేళ కొరటాల ఇలా సోషల్ మీడియాలో తనదైన శైలిలో రాజకీయాల మీద ఇలా స్పందించడం మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇకపోతే కొరటాల తాను తియ్యబోయే 'భరత్ అనే నేను' సినిమాలోని డైలాగ్‌ని ట్వీట్ చేశాడని కొందరు అంటుండగా...... మరికొందరు మాత్రం 'భరత్ అనే నేను' సినిమాని ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నాడంటూ చర్చలు మొదలు పెట్టారు..!   

Koratala Siva's Post in Twitter About Politics!:

Director Koratala Siva started new movie 'Bharat Ane Nenu' with Tollywood Super star Mahesh Babu. Recently Koratala Siva post in Twitter about Politics. This news hot topic in film industry present.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs