టాలీవుడ్ లో మెగా స్టార్ తర్వాత బెస్ట్ డ్యాన్స్ ర్ ఎవరు అంటే చాలామంది పేర్లే వినబడుతున్నాయి. చిరంజీవి కి డ్యాన్స్ లో ఎవరూ పోటీ పడేవాళ్ళు కాదు. డ్యాన్స్ విషయంలో చిరు రారాజుగానే వెలుగొందాడు. కానీ చిరు తర్వాత టాలీవుడ్ టాప్ డ్యాన్స్ ర్ ఎవరు అంటే... మాత్రం వెంటనే చెప్పే పరిస్థితి అయితే లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముగ్గురూ డ్యాన్స్ లో టాప్ పొజిషన్లోనే వున్నారు. ఈ ముగ్గురు కూడా డ్యాన్స్ విషయంలో ఎవరికీ వారే. అందుకే ఈ ముగ్గురిలో బెస్ట్ ఎవరు అంటే అందరు ఆలోచనలో ఉంటారు గాని ఆన్సర్ ఇవ్వడానికి ముందుకు రారు.
అయితే ఇప్పుడు ఈ ముగ్గురిలో బెస్ట్ డ్యాన్స్ ర్ ఎవరనేది టాలీవుడ్ లో టాప్ పోజిషన్ లో కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం చెప్పేసి షాకిచ్చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ముగ్గురితో సినిమాలు చేసింది. అందుకే వీరిలో డ్యాన్స్ పరంగా ది బెస్ట్ ఎవరనేది రకుల్ తేల్చేసింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఇద్దరూ డ్యాన్స్ విషయంలో కేక అంటూనే నా దృష్టిలో ఎన్టీఆర్ ది బెస్ట్ డ్యాన్స్ ర్ అంటూ చెప్పేసింది. ఎన్టీఆర్ అయితే ఏ డ్యాన్స్ మూమెంట్ అయినా సరే.. ఒక్కసారి డ్యాన్స్ మాస్టర్ చేసి చూపిస్తే దాన్ని చూపులతోనే పట్టేసి నేరుగా స్టెప్ వేసేస్తాడట.
ఎన్టీఆర్ తో పోటీ పడి డ్యాన్స్ చెయ్యాలి అంటే మాత్రం తనకి చాలా ఇబ్బంది అని చెబుతుంది రకుల్ ప్రీత్. అందుకే డ్యాన్స్ మాస్టర్స్ ఎన్టీఆర్ కు స్టెప్ చూపించడానికి ముందే తనకు ఆ స్టెప్స్ నేర్పిస్తే రిహార్సల్స్ చేసుకుంటానని డ్యాన్స్ మాస్టర్లను అడుగుతుంటానని రకుల్ చెప్పుకొచ్చింది. మరి ఎన్టీఆర్ ని ఇలా పొగిడిన రకుల్.... రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా డ్యాన్స్ విషయంలో ఏ మాత్రం తక్కువ కాదని కాకపోతే డ్యాన్స్ మాస్టర్స్ చూపించిన స్టెప్స్ ని ఒకసారి రిహార్సల్స్ చేసిన తర్వాత వారు టేక్ కు వెళ్తుంటారని చెప్పిన రకుల్.... అలాగని వాళ్లు తక్కువ డ్యాన్సర్లేమీ కాదంటూ చెప్పుకొచ్చింది.