Advertisement
Google Ads BL

బుల్లి ప్రిన్సెస్‌కి ఆ పాట భలే నచ్చింది..!


ప్రస్తుతం టాలీవుడ్‌లో విడుదలకు రెడీ అవుతున్న మోస్ట్‌ ఎవైటబుల్‌ మూవీలలో మహేష్‌బాబు నటిస్తున్న 'స్పైడర్‌' ఒకటి. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకుడు కావడం, ఈ చిత్రం ద్వారానే మహేష్‌ కోలీవుడ్‌లోకి స్ట్రెయిట్‌గా ఎంట్రీ ఇస్తుండటం, తమిళ హక్కులను లైకా ప్రొడక్షన్‌ సంస్థ భారీ మొత్తానికి థియేటికల్‌ రైట్స్‌ని సొంతం చేసుకుని తమిళంలో కూడా భారీ ఎత్తున రిలీజ్‌ చేయనుంది. దాదాపు 120కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఏకంగా 200కోట్ల దాకా బిజినెష్‌చేయడం హైలైట్‌. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రంపై తెలుగు, తమిళంలోనే కాదు.. హిందీలో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మహేష్‌ ఇంటెటిజన్స్‌ ఆఫీసర్‌గా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ మెడికల్‌ స్టూడెంట్‌గా కనిపించే ఈచిత్రంలో భరత్‌, ఎస్‌.జె.సూర్యలు విలన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 27 ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు ఆ చిత్రం చూద్దామా? అని మహేష్‌బాబు అభిమానులే కాదు.. సాదారణ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈచిత్రం టీజర్‌ సినిమాలోది కాకపోయిన గ్రాఫిక్స్‌, విఎఫ్‌ఎక్స్‌లతో బాగా ఆకట్టుకుంది. 

ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్‌లో మహేష్‌ కేక పుట్టిస్తున్నాడు. హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రంలోని 'బూమ్‌ బూమ్‌' పాట విడుదలై కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మిలియన్‌ మార్క్‌ని టచ్‌ చేసింది. 'బూమ్‌ బూమ్‌' పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, ఇక ఇది క్యాచీగా ఉండటంతో చిన్నారులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక మహేష్‌ బాబు కుమార్తె బుల్లి సితార తన తండ్రి నటించే చిత్రాలలో ఏదో ఒకపాటను బాగా లైక్‌ చేస్తూ, దానికి తగ్గట్లుగా ఆడుతూ పాడుతూ ఉంటుంది. ఇక 'స్పైడర్‌'లోని 'బూమ్‌ బూమ్‌' పాట ఆమెకు విపరీతంగా నచ్చేసింది. ఈ పాటను ఆమె అదే పాటను పాడుతూ రిపీట్‌ మోడ్‌లో ఉంచి, విన్నపాటనే మరలా వింటూ లయబద్దంగా, పెదవుల కదలకిలతో ఆకట్టుకుంటోంది. 

ఈ విషయాన్ని మహేష్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశాడు. ఈ పాట సితారకు కొత్త ఫేవరేట్‌ సాంగ్‌గా అయిందని, కారులో వెళ్తూ, 'బూమ్‌ బూమ్‌' పాటను వింటూ ఆనందిస్తున్న సితార వీడియోను మహేష్‌ తన అభిమానులతో పంచుకున్నాడు. తన చిట్టి 'స్పైడర్‌' కారులో ఆమె ఆ పాటను వింటోందని ఎంతో ఆనందంగా చెప్పాడు.

Mahesh Babu Daughter Sitara Liked Spyder Song:

Mahesh babu and Rakul Preet singh starring movie 'Spyder' Director by A R Murugadoss. Mahesh Babu Daughter Sitara liked Spyder movie Boom...Boom Song.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs