Advertisement
Google Ads BL

'బిగ్‌ బాస్‌'షోలో ఆత్మహత్యాయత్నం..!


తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా చేస్తోన్న 'బిగ్‌ బాస్‌' షో ఆద్యంతం వివాదాల మద్య సాగుతోంది. బిగ్‌ బాస్‌ హౌస్‌లో పార్టిసిపెంట్‌ ఓవియా ఆత్మహత్యాయత్నం చేసిందనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఇక ఈ షోపై పలు తమిళ సంఘాలు కేసులు పెడుతూ, కమల్‌పై ఏకంగా 100కోట్ల పరువు నష్టం దావా వేసే దాకా విషయం వెళ్లింది. కాగా ఇటీవల బిగ్‌బాస్‌ పార్టిసిపెంట్స్‌కి 'లగ్జరీ బడ్జెట్‌- పాయింట్స్‌ ఎర్న్‌' టాస్క్‌లో పార్టిసిపెంట్స్‌ అందరూ మానసిక వికలాంగులుగా నటించాలని సూచించడంతో దానిలో పార్టిసిపెంట్స్‌ చేసిన వివాదాన్పద కామెంట్స్‌తో ఆందోళనలు ఉదృతమయ్యాయి. మొదట్లో తప్పేం లేదని వాదించిన హోస్ట్‌ కమల్‌ హాసన్‌ కూడా తాజాగా రియలైజ్‌ అయి ఈ షోలో ఇస్తున్న టాస్క్‌ల పట్ల తన నిరసనను తెలిపాడు. 

Advertisement
CJ Advs

ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, కార్యక్రమ నిర్వాహకులు, బిగ్‌బాస్‌ కూడా ఇలాంటి చెత్త టాస్క్‌కు ఇవ్వరాదని, వీటి వల్ల కొందరు బాధపడతారని, ఓ టాస్క్‌ ఇచ్చే ముందు కాస్త జరగబోయే పరిణామాలను ముందుగా ఆలోచించి టాస్క్‌లు ఇవ్వాలని, లేకపోతే తాను బిగ్‌ బాస్‌ షో నుంచి వైదొలుగుతానని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ షో ముందుగా అనుకున్న ప్రకారం స్క్రిప్ట్‌ ప్రకారం జరిగే షో కాదని, అప్పటి కప్పుడు ఈ షోని మారుస్తుంటారని అన్నాడు.

ఇక తన సినిమాలలో తాను ఏనాడు మానసిక వికలాంగులను తప్పుగా చూపించలేదని, 'వసంత కోకిల' చిత్రంలో కూడా శ్రీదేవి పాత్ర ఎంతో ఔనత్యంతో ఉంటుందని, ఒక వేళ తన చిత్రంలో మానసిక వికలాంగుని పాత్ర ఉంటే దానిని తాను హీరోగానే చూపిస్తాను తప్ప అపహాస్యం చేయనన్నాడు. మొత్తానికి తమిళ 'బిగ్‌ బాస్‌' ఇప్పుడు తమిళ నాట పలు విధాలుగా చర్చనీయాంశంగా మారింది. 

Tamil Bigg Boss Show Update:

Kamal Haasan hosted of tamil 'Bigg Boss'Show Oviya Participat attempt to Suicide.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs