Advertisement
Google Ads BL

ఈ హీరో ఒక జంతువుతో వస్తున్నాడు..!


వెంకటేష్ ప్రస్తుతానికి చేతిలో సినిమాలేం లేకుండా ఖాళీగా గడుపుతున్నాడు. 'గురు' వంటి హిట్ అందించిన తర్వాత వెంకీ పూర్తిగా ఖాళీగానే ఉంటున్నాడు. 'గురు' టైం లోనే వెంకటేష్, కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడనే వార్తలొచ్చినప్పటికీ..... ఆ సినిమా ప్రస్తుతానికి పట్టాలెక్కే ఛాన్స్ లేదంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబందించిన పనులేమీ ముందుకు సాగడం అటుంచి అసలు పనులన్నీ ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఈసినిమాకి సంబందించిన నటీనటుల ఎంపిక కూడా పూర్తయిన తర్వాతే.... కారణాలు తెలియదు గాని ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు.

Advertisement
CJ Advs

ఇక  పూరితో ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరిగినప్పటికీ... దానికి సంబందించిన ఎటువంటి అప్ డేట్ లేదు. కానీ ఇప్పుడు వెంకీ కొత్త ప్రాజెక్ట్ మీద ఆయన అన్నగారు సురేష్ బాబు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. తన కొడుకు రానా నటించిన 'నేనే రాజు - నేనే మంత్రి' ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ బాబు తన తమ్ముడు వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. వెంకటేష్ తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడని..... సినిమా మొత్తం గ్రాఫిక్స్ ఉంటాయని చెబుతున్నాడు. అలాగే ఒక కొత్త కథతో ప్రేక్షకులు సంథింగ్ థ్రిల్ ఫీల్ అయ్యేలా ఆ సినిమా ఉంటుందని చెబుతున్నాడు.

ఇకపోతే ఈ భారీ బడ్జెట్ సినిమాని ఇప్పుడున్న పూరి, క్రిష్ లాంటి డైరెక్టర్స్ చెయ్యరని.... వెంకీ నటించే సినిమాకి ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం చేస్తాడని చెప్పాడు. అలాగే ఈ సినిమా కథ ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ అని..... ఒక జంతువు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపాడు. అలాగే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే గ్రాఫిక్స్ పనులు ప్రారంభమౌతాయని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. మరి ఎప్పుడు కొత్తదనం కోరుకునే వెంకటేష్ మరోసారి కొత్త కథతో ప్రేక్షకులని త్వరలోనే అలరించబోతున్నాడన్నమాట.

Victory Venkatesh Next Project With New Director:

Producer Suresh Babu in Nene Raju Nene Mantri movie promotions About Victory Venkatesh Next movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs